జాతీయ వార్తలు

వచ్చేనెలలో కార్మికుల సార్వత్రిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: కేంద్రప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మెకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సీఐటీయూ నేత సోమన్న మాట్లాడుతూ కార్మిక హక్కులకు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెపై ఈనెల 22న రాష్టస్థ్రాయి సదస్సులో చర్చలు జరపనున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా వచ్చేనెల 8, 9 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలకు పిలుపుఇచ్చారు. తెలంగాణలో కూడా విజయవంతం చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్ళుగా కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేసిందని సోమయ్య విమర్శించారు. బ్యాంకులు, బీమా రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ రంగసంస్థలను కేంద్రం ధ్వంసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు కట్టబెట్టడానికి కేంద్రం వ్యూహత్మకంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకురావడంతో పాటు వంద శాతం విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఉవ్విళ్ళూరుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా సవరించి యాజమాన్యాలకు మేలుచేస్తోందని ఆయన దుయ్యబట్టారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు నూతన పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని కోరినా మోదీ పట్టించుకోలేదన్నారు. ఐఎన్‌టీయుసీ నేత విజయకుమార్ మాట్లాడుతూ జాతి సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు మాట్లాడుతూ పారిశ్రామిక రంగాలను సంక్షోభంలోకి నెట్టింది మోదీనేనని అన్నారు. హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాస్కర్ రావు మాట్లాడుతూ సమ్మె సదస్సుకు కార్మిక సంఘాల నేతలు హాజరు కావాలని ఆయన సూచించారు. సీఐటీయూ రాష్ట్ర నేత పాలగుడు భాస్కర్ మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ హక్కులను ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించారని విమర్శించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌కేవీ వెంకటేశం, టీఎన్‌టీయుసీ ఎంకె బోస్,, ఎండీ మహమూద్, టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్, హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.