జాతీయ వార్తలు

ఇంటివారైన సైనా, కశ్యప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఓ ఇంటివారయ్యారు. వీరి పెళ్లి శుక్రవారం ఇక్కడ జరిగింది. గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేశారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ పొందిన నెహ్వాల్, కశ్యప్ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ప్రేమ విషయాన్ని బయపెట్టిన ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నామని అక్టోబర్‌లో ప్రకటించారు. ఇటీవలే ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మెగాస్టార్ చిరంజీవి, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి ఆహ్వాన పత్రాలు అందించారు. ప్రముఖులను కలిసిన సందర్భంగా వారితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ సైనా, కశ్యప్ పోస్టు చేశారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్స్ అయినా రిజస్ట్రార్ ఆఫీసులో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. ఇరుకుటుంబాలకు చెందిన కొద్దిమంది బంధువులే హాజరయ్యారు. ఈనెల 16న గచ్చిబౌలిలోని నోవాటెల్‌లో కనె్వన్షన్ హాలులో విందు ఏర్పాటు చేశారు. అనేక మంది క్రీడాకారులు, నగర ప్రముఖులు విందుకు హాజరుకానున్నారు.