జాతీయ వార్తలు

ఉత్కంఠ వీడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పేరును ఎఐసీసీ ఖరారు చేసింది. యువనేత సచిన్ పైలెట్‌ను ఉపముఖ్యమంత్రి పదవికి పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. గత రెండు రోజులుగా సాగుతున్న ప్రతిష్టంభన వీడింది. అశోక్ గెహ్లాట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీ, సోనియాగాంధీతోపాటు పార్టీ సీనియర్లు కేసీ వేణుగోపాల్ ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులతో చర్చించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు గవర్నర్‌ను కలిసి అశోక్ గెహ్లాట్‌ను సీఎల్‌పీనేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్‌కు తెలియచేస్తారన్నారు. గవర్నర్ కల్యాణ్ సింగ్‌ను అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్, ఇతర ఎమ్మెల్యేలు కలుస్తారు. అంతకు ముందు గెహ్లాట్‌తో రాహుల్ గాంధీ పలుదఫాలు సమావేశమయ్యారు. పార్టీ అగ్రనేతలు అనేక సార్లు పార్టీలో వివిధవర్గాల ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. చివరకు ప్రియాంక వాడ్రా అభిప్రాయాన్ని కూడా రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. రాహుల్ గాంధీకి ఈ చర్చల్లో పార్టీ సీనియర్లు జితేంద్ర సింగ్, అవినాష్ పాండేలు సహకరించారు.

కాంగ్రెస్ యోధుడు గెహ్లాట్
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ యోధుడుగా పేరు తెచ్చుకున్నారు. జాట్ నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా, పార్టీ విస్తరణ, అభివృద్ధి, ఎన్నికల్లో గెలుపుకు అవిశ్రాంతంగా శ్రమించినందు వల్ల అశోక్ గెహ్లాట్ అభ్యర్థిత్వం వైపే అందరూ మొగ్గుచూపారు. 1998, 2008లో ఆయన ముఖ్యమంత్రి పదవిని సమర్థంగా నిర్వహించారు. కాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ వర్గం నుంచి గెహ్లాట్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 96 సీట్లు రాగా, అప్పట్లో బీఎస్‌పీ, ఇండిపెండెంట్ల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 150సీట్లు వచ్చాయి. అశోక్ గెహ్లాట్ రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చాయి. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో, ఏఐసీసీ నేతల సమావేశంలో అశోక్ గెహ్లాట్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు.