జాతీయ వార్తలు

భారత్ వల్లే బంగ్లాదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కొతా, డిసెంబర్ 15: భారత్ సైనిక జోక్యం లేకుండా బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని సాధించి ఉండేది కాదని బంగ్లాదేశ్ ఎపీ ఖాజీరోజీ చెప్పారు. పాకిస్తాన్ మతపరమైన కబంధ హస్తాల నుంచి బంగ్లాదేశ్ విముక్తి సాధించిందని, దీని కోసం భారత్ సైనికులు తీవ్రంగా పోరాడి అమరులయ్యారన్నారు. బంగ్లాదేశ్ ఈ విషయంలో సదా కృతజ్ఞతతో భారత్ పట్ల ఉంటుందన్నారు. భారత్ సైనికుల నిరుపమానసేవలను బంగ్లాదేశ్ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు. మీ సహాయం లేకుండా మేము ఈ రోజు స్వతంత్ర దేశంగా ఉండగలమా అని ఆమె అన్నారు. వియత్నాం స్వాతంత్య్రం కోసం తొమ్మిదేళ్లు పోరాడిందని, బంగ్లాదేశ్ తొమ్మిది నెలలు అలుపెరగని పోరాటం చేసిందన్నారు. ఆమె ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, పాకిస్తాన్ సైనికులు తూర్పు పాకిస్తాన్ లేదా తూర్పు బెంగాల్‌లో ఆకృత్యాలు, అరాచకాలకు పాల్పడ్డారన్నారు. ఎంతో మంది అమరులయ్యారన్నారు. బెంగాలీ మాట్లాడే ప్రజల పట్ల పాక్ సైనికులు అనేక దురాగతాలకు పాల్పడ్డారన్నారు. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య డిసెంబర్ 3వ తేదీన యుద్ధం మొదలైందన్నారు. రెండు వారాల్లోనే లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత్ సైన్యానికి 99వేల మంది సైనికులతో లొంగిపోయారన్నారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వస్తే ఆహారం, ఆశ్రయం ఇచ్చామన్నారు. అదే బంగ్లాదేశీయులు భారత్‌కు వస్తే కడుపులో పెట్టుకుని చూసి ఆదరించారన్నారు.