జాతీయ వార్తలు

ఐక్యతా విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెవాడియా(గుజరాత్), డిసెంబర్ 15: నర్మదా జిల్లాలో ఏర్పాటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం సందర్శించారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఐక్యతా విగ్రహం వద్ద ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్ సింగ్‌తో కలిసి రాష్టప్రతి ఉదయం ఇక్కడకు చేరుకున్నారు. భారత తొలి హోమ్‌మంత్రి జ్ఞాపకార్థం ప్రాంగణంలో కోవింద్ ఓ మొక్కను నాటారు. తరువాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 182 మీటర్ల ఎత్తయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని గతనెలలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. పటేల్‌కు శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్రపతి కోవింద్ మ్యూజియం, ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అక్కడ నుంచి బయలుదేరి ఐక్యతా విగ్రహానికి 5 కిలోమీటర్ల దూరంలోని కెవాడియాకు చేరుకున్నారు. కెవాడియాలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. ఐక్యతా విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఈ రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇరవై కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనున్నారు. కెవాడియా రూట్‌ను మెయిల్ బ్రాడ్‌గేజ్ లైన్‌కు కలుపుతారు. దీని కోసం దభోయ్-్ఛండోడ్ నేరోగేజ్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చడానికి రైల్వేశాఖ అనుమతి మంజూరు చేసింది. ఛండోడ్ నుంచి కెవాడియాకు 32 కిలోమీటర్లు కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తారు.
చిత్రం.. గుజరాత్‌లోని కెబాడియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్