జాతీయ వార్తలు

నేడు రాయబరేలికి మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 15: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి నియోకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పర్యటించనున్నారు. అనంతరం ఆయన అలహాబాద్ చేరుకుని వచ్చే ఏడాది అక్కడ నిర్వహించనున్న కుంభమేళా ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో ప్రధాని ఒక బహిరంగ సభలో పాల్గొంటారని, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారని యూపీ బీజేపీ ప్రతినిధి నవీన్ శ్రీవాత్సవ వెల్లడించారు. జిల్లా అధికారుల సమాచారం మేరకు ప్రధాని రాయబరేలి నియోజకవర్గ పర్యటనలో దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల విలువచేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం నియోజకవర్గంలో పర్యటించి ప్రధాని రాకకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారని ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య తెలిపారు. అలహాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్న ఎన్నికలకు సమర శంఖం పూరిస్తారని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించగా, అది తాత్కాలికమేనని, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందిందని వౌర్య విమర్శించారు. రాఫెల్ డీల్‌పై కాంగ్రెస్ చేసింది తప్పుడు ప్రచారమేనని చెప్పడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని ఆయన అన్నారు. రాయబరేలీలో ప్రధాని మోదీ పర్యటన ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో సోనియా పర్యటించిన దాఖలాలు లేవు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా 2016 తర్వాత సోనియా మళ్లీ ఈ నియోజకవర్గం మొఖం చూడలేదు. దీన్ని ఆసరా చేసుకుని ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.