జాతీయ వార్తలు

రాఫెల్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రాఫెల్ జెట్స్ కొనుగోళ్లపై కాంగ్రెస్ చేస్తున్న వివాదాన్ని ధీటుగా బదులిచ్చేందుకు దేశ వ్యాప్తంగా 70నగరాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభల్లో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కాంగ్రెస్ కుట్రను ఎండగట్టాలనే లక్ష్యంతో ఈ సభలు, ర్యాలీలను నిర్వంచనున్నట్లు బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ చెప్పారు. జాతీయ భద్రతపై బీజేపీ రాజీపడకుండా ముందుకు దూసుకెళుతుంటే, కాంగ్రెస్ మాత్రం ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తోందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయమై కేంద్రం తప్పేమీలేదని రికార్డులు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్యాలను కోర్టు తిరస్కరించిందన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌దాస్, దేవేంద్రఫడ్నవీస్, విజయ్ రూపానీ, సర్బానంద సోనోవాల్‌లు ఈ సమావేశాలనునిర్వహిస్తారు. గువహటి, అహ్మదాబాద్, జైపూర్, అగర్తలాలో ప్రెస్‌మీట్లను నిర్వహిస్తారు. కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవడేకర్, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, సురేష్ ప్రభూ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇంకా పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుప్రీంకోర్టు 36 పిటిషన్లను డిస్మిస్ చేసిన విషయం విదితమే.