జాతీయ వార్తలు

రాహుల్.. మా ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 16: జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా మరో బలమైన అడుగు పడింది. ఇందుకు ఆదివారం చెన్నైలో జరిగిన దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణే వేదిక అయింది. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు రాజకీయ స్వరూపాన్ని అందిస్తూ ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరును డిఎంకె అధినేత ఎమ్‌కె స్టాలిన్ ఈ ప్రతిపాదించారు. మోదీ సారథ్యంలోని ఫాసిస్టు ప్రభుత్వాన్ని ఓడించగలిగే శక్తి రాహుల్ గాంధీకే ఉందని, ఆయన నాయకత్వాన్ని
మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడి వైఎమ్‌సిఎ మైదానంలో జరిగిన బహిరంగ సభలో స్టాలిన్ ఉద్ఘాటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వ పతనం ఖాయమని, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ నాయకత్వంలోనే బీజేపీ వ్యతిరేక కూటమి ఎన్నికల్లో పోరాడుతుందని తెలిపారు. రాహుల్ సారథ్యంలో నవభారతాన్ని నిర్మిస్తామని, దేశానికి సుపరిపాలన అందిస్తామని స్టాలిన్ అన్నారు. వాజపేయి సారథ్యంలోని ఎన్‌డిఏ కూటమిని ఎదుర్కొనేందుకు యూపీఏ సారథిగా 2004లో సోనియా పేరును, 1980లో ఇందిరా గాంధీ నాయకత్వాన్ని తన తండ్రి కరుణానిధి బలపరిచిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విగ్రహావిష్కరణ, అనంతరం జరిగిన బహిరంగ సభకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు,కేరళ సీఎం పినరాయి విజయన్, పాండిచ్ఛేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి హాజరయ్యారు. దేశాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ నాయకత్వానికి మరింత శక్తిని సమకూర్చాలని బీజేపీ వ్యతిరేక కూటమి నేతతలందరినీ తాను అభ్యర్థిస్తున్నానని స్టాలిన్ అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి యువనాయకుడని, ఆయన పోరాట పటిమ, సైద్ధాంతిక నిబద్ధతను కరుణానిధి కూడా ప్రశంసించారని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ కారణంగా దేశంలో సామాజిక సామరస్యం దెబ్బతిందని, భారత దేశం మరో పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. డిఎంకె, దాని మిత్ర పక్షాలు మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించడానికి గల కారణాలను స్టాలిన్ వివరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా కాకుండా వారసత్వంగా అధికారం వచ్చే రాజులా వ్యవహరిస్తున్నారని, తానే రాష్టప్రతి, తానే చీఫ్ జస్టిస్, తానే ఆర్‌బిఐ గవర్నర్, తానే సీబీఐ అన్న చందంగా మోదీ తీరు ఉందన్నారు. వీటి కారణంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకు వ్యతిరేకంగా మారాయన్నారు.
ఒక్కటిగా ఎదుర్కొంటాం: రాహుల్
దేశంలో సుప్రీం కోర్టు, రిజర్వ్ బ్యాంక్ వంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని, బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలను సాగనిచ్చేది లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. దేశ వ్యవస్థల్నే కాకుండా, నిరుపమానమైన భారత సంస్కృతినే దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నాలను ఐక్యంగా, ఒక్కటిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసిన రాహుల్ ‘ ఈ దిశగా దేశంలో ప్రతి ఒక్కరూ ఏకం అవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని చేతులూ కలుస్తున్నాయి’ అని అన్నారు.
చెక్కుచెదరని బంధం: సోనియా
మోదీ ప్రభుత్వ రాజ్యాంగ విలువలనే మంటగలుపుతోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ధ్వజమెత్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు డిఎంకె-కాంగ్రెస్ మధ్య బలమైన సంబంధాలు ఏర్పడాలని పిలుపునిచ్చారు. డిఎంకె ప్రధాన కార్యాలయంలో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సోనియా ‘1971, 1980లో మాజీ ప్రధాని ఇందిరకు కరుణానిధి అందించిన మద్దతును ఎన్నటికీ మరచిపోలేం’అని అన్నారు. బ్యాంకుల జాతీరుూకరణ, రాజభరణాల రద్దు నాటి నుంచి కాంగ్రెస్, డిఎంకెల మధ్య చెక్కుచెదరని రీతిలో మైత్రీ బంధం కొనసాగుతోందని అన్నారు.అలాగే యూపీఏ సర్కార్‌కు కూడా కరుణానిధి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్న సోనియా ఆయన సాహితీ సంపద, వాక్పటిమను కొనియాడారు.

చిత్రం..చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో దివంగత డీఎంకే నేత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వేదికపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ, డీఎంకే అధినేత స్టాలిన్, ఏపీ-కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబు, పినరయ విజయన్