జాతీయ వార్తలు

పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై పారిస్ ఒప్పందాన్ని జయప్రదంగా అమలు చేసేందుకు వీలుగా పోలాండ్‌లో అన్నిదేశాలు చర్చించాయని భారత్ పేర్కొంది. ఈ చర్చలు సానుకూల వాతావరణం మధ్య జరిగాయని భారత్ తెలిపింది. భారత్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా అమలు చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్రం పేర్కొంది. 2020నాటికి భూతాపాన్ని తగ్గించేందుకు వీలుగా పోలాండ్‌లో రెండు వందల దేశాల ప్రతినిధులు చర్చించారు. ఈ చర్చలు గనుల నగరం కాటోవైస్‌లో జరిగాయి.
అన్ని దేశాలు వాతావరణ మార్పులపై అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. పారిస్ ఒప్పందం అమలుకు సంబంధించి ఫార్ములా, మార్గదర్శకాలు ఖరారయ్యాయని భారత్ పేర్కొంది. కాగా భారత్ నుంచి హాజరైన పర్యావరణ ప్రతినిధుల బృందంలో ఒక గ్రూపు పారిస్ ఒప్పందం అమలు దిశగా ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. సెంటర్ పర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్ర భూషణ్ మాట్లాడుతూ, పారిస్ ఒప్పందం రూల్‌బుక్‌లో నిబంధనలు సరళంగా, అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కేంద్రం మాత్రం పర్యావరణ పరిరక్షణకు, భూతాపం తగ్గించేందుకు రాజీలేనివిధంగా భారత్ వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. ఈ చర్చల్లో భారత్ స్వీయ ప్రయోజనాల పరిరక్షణకుప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధిచెందిన దేశాలు ఇతోధికంగా నిధులు వెచ్చించాలని భారత్ పోలాండ్ సదస్సులోగట్టిగా కోరింది.