జాతీయ వార్తలు

13కు పెరిగిన కల్తీ ఆహార మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 16: కర్నాటకలోని చామనగర్ జిల్లాలో ఒక ఆలయంలో ప్రసాదాన్ని భుజించి దాదాపు వందమంది అస్వస్థతకు గురికాగా, అందులో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 13కు పెరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసి ఐపీసీ 304 సెక్షన్ కింద హత్య కేసును నమోదు చేశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంగేశ్వరి (36), సాలమ్మ (35) ఆదివారంనాడు ప్రాణాలు కోల్పోయినట్లు స్టార్ హెల్త్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ సురేష్ శాస్ర్తీ తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుతెలుస్తోంది. ఇంకా నలుగురు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. సులవాది గ్రామంలో శుక్రవారం ఉదయం మారప్పదేవి ఆలయానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలిసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీన్ని భుజించిన దాదాపు వందమంది కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన బెంగుళూరు, మైసూరు, సమీప ప్రాంతంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రసాదాన్ని తిన్న కాకులు, ఇతర పక్షులు కూడా దాదాపు 80 వరకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.