జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్ సీఎంగా బఘేల్ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, డిసెంబర్ 17 : చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ సోమవారం నాడు పదవి స్వీకారణ ప్రమాణం చేశారు. పదవికి చివరి వరకు పోటీ పడ్డ ఎమ్మెల్యేలు టిఎస్ సింగ్ దేవ్, తమరద్వజ్ సాహులు మంత్రులుగా ప్రమాణం చేశారు.
రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వీరిచేత ప్రమాణం చేయంచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతకుముందు వరకు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన బీజేపీ నాయకుడు రమణ్‌సింగ్ కొత్త ముఖ్యమంత్రిని అభినందించారు.
రాష్ట్రంలోని పటాన్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం ఆలస్యంగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. 2013లో రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యాన్ని చేపట్టిన బఘేల్ తాజా ఎన్నికల్లో పార్టీ విజయంలో క్రియశీలక భూమిక పోషించారు. 90 స్థానాలు కలిగిన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండో వంతు మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 2003 నుంచి చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి తాజా ఎన్నికల్లో కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చాయ. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో అమితుమి అన్న రీతిలో జరిగిన తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం వెనుక బఘేల్ కృషి ఎంతో ఉంది. పార్టీని పునరుద్ధరించడంతో పాటు తిరుగులేని మెజారిటీని సాధించడంలో కూడా ఆయన అనుసరించిన రాజకీయ వ్యూహం ఫలించింది.

చిత్రం..చత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి బఘేశ్ బఘేల్,
మంత్రులు సాహు, టీఎస్ సింగ్‌దేవ్‌తో గవర్నర్ ఆనందిబెన్ పటేల్