జాతీయ వార్తలు

రాజస్థాన్ సారథిగా గెహ్లాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 17: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ సోమవారం పదవీస్వీకార ప్రమాణం చేశారు. అలాగే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కూటమి నేతలందరూ గెహ్లాట్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. చారిత్రక అల్బర్ట్ హాల్‌లో గవర్నర్ కల్యాణ్‌సింగ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. సచిన్ పైలట్ అనంతరం మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ వెంటనే ఆయనను ఉపముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తదితరులు గెహ్లాట్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ బీజేపీ వ్యతిరేక కూటమికి లాంఛనంగా శ్రీకారం చుట్టిన డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నాలుగో నేత గెహ్లాట్ కావడం గమనార్హం. 1998లో తొలిసారిగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2008లో మరోసారి ఈ పీఠాన్ని అధిష్టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని, అంతవరకు తలపాగా ధరించనని శపథం చేసిన సచిన్‌పైలట్ ఈ కార్యక్రమంలో తలపాగాతో కన్పించారు.

చిత్రం..రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గెహ్లాట్‌తో
రాష్ట్ర గవర్నర్ కళ్యాణ్ సింగ్, పక్కన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్