జాతీయ వార్తలు

లోక్‌సభ ట్రిపుల్ ట్రిపుల్ తలాక్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లును సోమవారం ప్రతిపక్షాల గొడవ, గందరగోళం మధ్య లోక్‌సభలో ప్రతిపాదించింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ట్రిపుల్ తలాక్ బిల్లులో పలు లోపాలున్నందున దీనిని ప్రతిపాదిందుకు అనుమతించరాదని కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ చేసిన వాదనను రవిశంకర్ ప్రసాద్ కొట్టివేశారు. వంట బాగాలేదు.. బట్టలు సరిగా ఉతకలేదంటూ ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నారు. ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సప్ సందేశాల ద్వారా కూడా ట్రిపుల్ తలాక్ చెప్పేస్తున్నారు. ఈ దురాచారం వలన ముస్లిం మహిళలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయాన్ని అరికట్టేందుకు తాము ప్రతిపాదించిన బిల్లులో ఎలాంటి లోపాలు లేవని రవిశంకర్ వాదించారు. రవిశంకర్ ప్రసాద్ వాదనలు విన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ ట్రిపుల్ తలాక్ బిల్లును సభలో ప్రతిపాదించేందుకు అనుమతి ఇచ్చారు. ఆ వెంటనే బిల్లును సభ ముందు ప్రతిపాదించి చర్చ జరపాలని రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ద్వారా ట్రిపుల్ తలాక్‌ను చట్ట విరుద్ధం చేయటంతోపాటు ట్రిపుల్ తలాక్ ఇచ్చినవారికి మూడేళ్ల కఠిన కారగార శిక్ష విధిస్తారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అంతర్‌మంత్రిత్వ శాఖల కమిటీ ఈ ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించింది. మాటమాత్రంగా, రాతపూర్వకంగా, ఈ-మెయి ల్, ఎస్‌ఎంఎస్, వాట్సప్ తదితర ఎలక్ట్రానికి పద్ధతిలో ట్రిపుల్ తలాక్ (తలాక్-ఏ-బిద్దత్) ఇవ్వటాన్ని నిషేధించింది. ట్రిపుల్ తలాక్ ఇచ్చే భర్తకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించటంతోపాటు పిల్లలుండే పక్షంలో వారి పెంపకం బాధ్యతలను తల్లికి అప్పగిస్తారు. తల్లి, పిల్లలను పోషించే బాధ్యత శిక్షకు గురైన భర్తపైనే ఉంటుంది. ముస్లిం మహిళలకు న్యాయం కలగజేయటంతోపాటు వారి హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తెస్తున్నామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇస్లాం మతానికి సంబందించిన ప్రార్థనల విధానం, మతపరమైన సంప్రదాయాలకు ఈ బిల్లుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదొక చారిత్రాత్మిక దినం, దీనిపై వెంటనే చర్చ జరిపి ఆమోదించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అయితే శశిథరూర్‌తోపాటు ఆర్జేడీ, ఎంఐఎం, బీజేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అన్నా డీఎంకే తదితర పార్టీలు ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాయి. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ములాయ సింగ్ యాదవ్ కూడా ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రతిపాదనను వ్యతిరేకించారు. గతంలో ట్రిపుల్ తలాక్ బిల్లును గట్టిగా వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం వౌనం వహించటం గమనార్హం. కేవలం ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడటం మంచిది కాదు.. ఇతర మతాలలోని మహిళల హక్కుల గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నదని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15కు ఈ బిల్లు పూర్తిగా విరుద్ధమని ఆయన వాదించారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూసేందుకు అవసరమైన జాగ్రత్తలు ఈ బిల్లులో లేవని శశిథరూర్ విమర్శించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్న ఈ బిల్లును ఆమోదించే హక్కు, అధికారం ఈ పార్లమెంటుకు లేదని ఎంఐఎం అధినాయకుడు అసదుద్దీన్ ఒవైసీ సభ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ‘మీరు కేవలం ముస్లిం మహిళల ప్రయోజనాల పరిరక్షణ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇతర మతాలకు చెందిన 20 లక్షల మంది మహిళలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు.. వారి హక్కుల పరిరక్షణ గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు’ అని ఆయన ప్రశ్నించారు.