జాతీయ వార్తలు

ముంబయి ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వంద మందికి పైగా రోగులు, వారిని పరామర్శించేందుకు వచ్చిన సందర్శకులు గాయపడ్డారు. సబర్బన్ అంధేరిలోని ప్రభుత్వ ఇఎస్‌ఐసి ఆసుపత్రిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 108మంది చిక్కుకు పోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీరిలో కొంత మందిని సహాయ బృందాలు, అగ్ని మాపక దళాలు రక్షించగలిగాయని తెలిపారు. మొత్తం ఐదు అంతస్థులు కలిగిన ఈ భవనంలో నాలుగో అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగిందని, తీవ్రంగా గాయపడ్డ 15మందిని రక్షించి సమీపంలోని కూపర్ ఆసుపత్రికి తరలించామని, వీరిలో ఇద్దరు అప్పటికే మరణించారని ఆయన తెలిపారు. గాయపడ్డ వారిలో మిగిలిన వారిని నగరంలోని ఇతర అసుపత్రులకు తీసుకెళ్లామని, మరణించిన వారి ఆచూకీని నిర్థారించాల్సి ఉందన్నారు. అగ్ని ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగిందన్నది త్వరలోనే నిగ్గుదేలుస్తామని చెప్పారు. సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి అగ్ని మాపక దళానికి నాలుగు గంటల ప్రాంతంలో సమాచారం అందించారు. కొద్ది వ్యవధిలోనే పది బృందాలు, 15 అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని ఆ అధికారి వెల్లడించారు. తాము రక్షించిన, గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి నిలకడగానే ఉందని అగ్ని మాపక దళ చీఫ్ పిఎస్ రహంగ్‌డాలే తెలిపారు. మంటలు నాలుగో అంతస్థులోనే సంభవించినా పొగలు భవనం అంతటా వ్యాపించాయని చెప్పారు.
చిత్రాలు..సహాయక చర్యలు చేపడుతున్న అగ్నిమాపక దళాలు