జాతీయ వార్తలు

పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులకు టీఆర్‌ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, జీ.నగేష్, బండ ప్రకాష్ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రవి శంకర్ ప్రసాద్‌లను కలిశారు. పార్లమెంట్‌లో కేంద్ర జల వనరులు, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు ఒక వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు తక్షణమే పర్యావరణ, జల వనరుల శాఖకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులను కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రహదారులు అభివృద్ధికి నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రీజినల్ రింగ్‌రోడ్ 365 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలని భావిస్తోందని, ఈ రింగ్‌రోడ్‌కు కేంద్రం సహాయం చేయాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీలు తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై ఈ నెల 21న సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్లడించారు. ఉమ్మడి హైకోర్టు విభజన సాధ్యమైనంత త్వరగా చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగున్నర సంవత్సరాలైన ఇంకా ఉమ్మడి హైకోర్టులోనే కార్యకలాపాలు చేస్తున్నారని కేంద్ర మంత్రికి ఎంపీలు వివరించారు. హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజనపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుందని ఎంపీలు తెలిపారు.