జాతీయ వార్తలు

షరా మామూలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో ఆరో రోజు కూడా ఎలాంటి మార్పూ కనిపించలేదు. మంగళవారం కూడా ప్రతిపక్షాలు ఉభయ సభల్లో పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తే బీజేపీ సభ్యులు తమ సీట్లలో నిలబడి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇరుపక్షాలు పోటాపోటీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలివ్వడంతో ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. రాజ్యసభ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పని చేసి బుధవారానికి వాయిదా పడగా.. లోక్‌సభ ఇరవై నిమిషాలు పనిచేసి వాయిదాపడింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు చేసేందుకు జేపీసీని నియమించాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు డిమాండ్ చేయగా అన్నా డీఎంకే సభ్యులు కర్నాటక ప్రభుత్వం చేపట్టిన మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలంటూ నినాదాలిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు గొడవ చేశారు. రాఫెల్ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సభ్యులు నినదించారు. రాఫెల్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూనే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షం సభ్యులతో వాగ్వివాదానికి దిగారు. లోక్‌సభ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలివ్వడంతో సభ స్తంభించిపోయింది. దీనితో స్పీకర్ సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం ఒకటి, రెండు బిల్లులను చర్చకు తీసుకున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు తారస్థాయికి చేరుకోవడంతో సభ్యులకు హితవు చెప్పేందుకు స్పీకర్ ప్రయత్నించారు. సభ్యుల బాధ్యతారహిత ప్రవర్తన వల్ల పార్లమెంటు ప్రతిష్ట దెబ్బతింటోందని వాపోయారు. ఆ తరువాత లోక్‌సభను బుధవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రాలు.. లోక్‌సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే
*రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్