జాతీయ వార్తలు

కేంద్ర నిర్ణయం అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్ / న్యూఢిల్లీ, మార్చి 28: అసెంబ్లీలో బల నిరూపణ చేయడానికి రాష్ట్ర గవర్నర్ గడువును నిర్ధారించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్టప్రతి పాలన విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ సోమవారం కోర్టులో సవాల్ చేసింది. పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఏ కారణంతో రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను విధించాలన్న నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని ఈ పిటిషన్‌లో ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ను యు.సి.్ధయాని నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న మీదట తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హరీశ్ రావత్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 356వ అధికరణను ప్రయోగించడానికి ఏమాత్రం రాష్ట్రంలో అవకాశం లేదని, అయినప్పటికీ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సింఘ్వి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడాన్ని ఆయన సవాల్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రంపై కేంద్రం తన అధికారాన్ని ప్రయోగించిందని, ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి మనీశ్ తివారి అన్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి రావత్‌కు రాష్ట్ర గవర్నర్ గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్.బొమ్మయి కేసులో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. ఓ ప్రభుత్వ మెజారిటీని రుజువు చేయడానికి అసెంబ్లీలో పరీక్ష జరపడం ఒక్కటే మార్గమన్న విషయాన్ని సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసిందని, అలాంటప్పుడు రావత్ సర్కార్‌ను కేంద్ర కేబినెట్ ఎందుకు బర్తరఫ్ చేసిందని తివారి ప్రశ్నించారు. అయితే రాష్టప్రతి పాలన విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన సిఫార్సును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడం వెనుక ఉన్న కారణలపై వ్యాఖ్యానించడానికి తివారి నిరాకరించారు.

చిత్రం పదవీచ్యుతుడైన ఉత్తరాఖండ్
ముఖ్యమంత్రి హరీశ్ రావత్