జాతీయ వార్తలు

ఎంపీ హజ్రాపై టీఎంసీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 9: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, బోల్పూర్ పార్లమెంటు సభ్యుడు అనుమప్ హజ్రాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. అంతకు ముందు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన బిష్ణుపూర్ లోక్‌సభ సభ్యుడు సౌమిత్ర ఖాన్‌ను కూడా టీఎంసీ బహిష్కరించింది.
వీరిద్దరూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ ప్రకటించారు. ఇటీవల కాలంలో పార్టీ అధినాయకత్వాన్ని ఈ ఎంపీలు ఇద్దరూ తీవ్రంగా విమర్శించారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. కాగా, బీజేపీలో చేరకముందే సౌమిత్ర ఖాన్‌పై వేటు పడిందని పార్టీ వ్యాఖ్యానించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి చెందిన మరికొంత మంది ఎంపీలు కూడా తమ పార్టీలో చేరుతారని బీజేపీ చేసిన ప్రకటన పట్ల టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై వేటు పడిందని, అలాంటి వారు ఇప్పుడు ఎవరూ లేరని వ్యాఖ్యానించింది. బీజేపీ పగటి కలలు కంటున్నదని విమర్శించింది.