జాతీయ వార్తలు

సార్వత్రిక సమ్మె విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని, ఇందుకు నిరసనగా చేపట్టిన రెండు రోజుల సమ్మె విజయవంతమైందని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాలు, పట్టణాల్లో కార్మికులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలను నిర్వహించినట్టు పేర్కొంది. కార్మిక సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని తెలిపింది. ఇలాంటే, జమ్మూకాశ్మీర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులు కొన్ని ప్రాంతాల్లో రాళ్లు రువ్వగా, మరికొన్ని ప్రాంతాల్లో వాహనాలను ధ్వంసం చేశారు. కోల్‌కతాలోని రాజాబజార్‌లో నిరసనకారులు రాళ్లు రువ్విన సంఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. పౌర రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బీజేపీ అన్ని రకాలుగానూ కార్మిక వ్యతిరేక చర్యలను అనుసరిస్తున్నదని ఆరోపిస్తూ తమిళనాడులో చేపట్టిన సార్వత్రిక సమ్మె పార్షికంగా విజయవంతమైంది. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. దీనితో పలు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. తెలంగాణలో ప్రభుత్వ రంగ బ్యాంకులపై సమ్మె ప్రభావం కనిపించింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా చాలా చోట్ల కార్మిక సంఘాలు బంద్‌ను పాటించి, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలతో హోరెత్తించినప్పటికీ, చెప్పుకోదగ్గ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

చిత్రాలు.. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆరోపిస్తూ, తక్షణమే కార్మిక సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ)
పిలుపునిచ్చిన రెండు రోజుల జాతీయ బంద్‌లో భాగంగా బుధవారం, రెండోరోజు శ్రీనగర్‌లో భారీ ప్రదర్శనకు దిగిన కార్మికులు. *కోల్‌కతాలో సమ్మె చేస్తున్న వివిధ కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు.
*పాట్నాలో వామ పక్ష పార్టీలు, కార్మిక సంఘాల నాయకుల అరెస్టు