జాతీయ వార్తలు

బీసీ రిజర్వేషన్లు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల ప్రజలకు ఇప్పుడిస్తున్న 27 శాతం రిజర్వేషన్లను మరింత పెంచేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించాలని బీఎస్పీ పక్షం నాయకుడు సతీష్‌చంద్ర మిశ్రా డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభలో ఉన్నత వర్గాలకు చెందిన బీదవారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. ఉన్నత వర్గాల్లోని బీదవారికి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించటాన్ని సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల వారికి ఇప్పుడిస్తున్న 27 శాతం రిజర్వేషన్లు ఏమాత్రం సరిపోవటం లేదు.. అందుకే మరింత పెంచవలసిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు.
వెనుబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని మిశ్రా ప్రతిపాదించారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని తాము గతంలో డిమాండ్ చేసిప్పుడు మొత్తం రిజర్వేషన్లను యాభై శాతం కంటే ఎక్కువ చేసేందుకు రాజ్యాంగం అంగీకరించదని చెప్పారు.. ఉన్నత వర్గాలకు చెందిన బీదవారికి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తున్నందున బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు కూడా రాజ్యాంగాన్ని సవరించాలని మిశ్రా డిమాండ్ చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసమే పది శాతం రిజర్వేషన్ల బిల్లును తెస్తోందని ఆయన విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల బ్యాక్‌లాగ్‌ను పూర్తిచేయలేని మీరు ఉన్నత వర్గాల్లోని బీదవారికి రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ఆయన నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలు ఎప్పటికప్పుడు తగ్గిపోతుంటే మీరు రిజర్వేషన్లు కల్పించటం హస్యాస్పదం కాదా? అని మిశ్రా ప్రశ్నించారు. పది శాతం రిజర్వేషన్లు పెద్ద మోసమని ఆయన దుమ్మెత్తిపోశారు. బీఎస్పీ పది శాతం రిజర్వేషన్ల బిల్లును సమర్థిస్తోందంటూ మిశ్రా ప్రసంగాన్ని ముగించారు.