జాతీయ వార్తలు

సిక్సర్ కొట్టాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటిస్తారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. బుధవారం రాజ్యసభలో అగ్రవర్ణాలకు చెందిన బీదవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం త్వరలోనే మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటిస్తుందని వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ఆఖరు రోజు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ఎందుకు ప్రతిపాదించారంటూ ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మోదీ ప్రభుత్వం ఇంతటితో ఆగటం లేదు.. ముందుముందు మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాబోతున్నాయని అన్నారు. శీతాకాల సమావేశాల ఆఖరు రోజు మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల సిక్సర్ కొట్టింది.. ఇకమీదట కూడా మరిన్ని సిక్సర్లు కొడతామని ఆయన చెప్పారు. క్రికెట్‌లో మ్యాచ్ మొగిసే సమయంలో సిక్సర్లు వస్తాయనేది మీకు తెలియదా..? ఇప్పుడదే జరుగుతోందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. హిందు, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన మతాలకు చెందిన ఉన్నత వర్గాల్లోని బీదవారికి కల్పిస్తున్న 10 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పది శాతం రిజర్వేషన్లు పొందేందుకు నిర్ణయించిన అర్హతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాల మేరకు మార్చుకోవచ్చునని ఆయన సూచించారు. ఉన్నత వర్గాల్లోని బీదవారికి రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాలని ఎన్నో సంవత్సరాల నుండి ఆలోచిస్తున్నా ఇవ్వలేకపోయారు.. మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎంతో ధైర్యంతో ఈ రిజర్వేషన్ల సౌకర్యం కల్పిస్తోందని ఆయన తెలిపారు. మీరు ధైర్యం చేయలేకపోయారు.. మేము ధైర్యం చేస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. పది శాతం రిజర్వేషన్ల బిల్లుకు ప్రతిపక్షం హృదయపూర్వకంగా మద్దతు ఇవ్వాలి తప్ప ఇలా షరతులతో కాదని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసమే మోదీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు కల్పిస్తోందంటూ ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రాబోతోందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

చిత్రం..రవిశంకర్