జాతీయ వార్తలు

రాష్ట్రాలతో సంప్రదించకుండానే అజెండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండానే జీఎస్‌టీ సమాఖ్య సమావేశం అజెండాను సిద్ధం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన 32వ జీఎస్‌టీ సమాఖ్య సమావేశంలో ఈ విమర్శలు చేశారు. వివిధ వస్తులపై పన్నుల తగ్గింపు, మినహాయింపుకు సంబంధించిన పలు అంశాలపై జీఎస్‌టీ సమాఖ్య సమావేశంలో చర్చ జరగాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా భావిస్తున్నాయి.. వీటిని అజెండాలో చేర్చకపోవటం వలన ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోతున్నాయని ఆయన చెప్పారు. జీఎస్‌టీ సమాఖ్య సమావేశం అజెండాను సిద్ధం చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో తప్పనిసరిగా సంప్రదించాలని రామకృష్ణుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలను అజెండాలో రాకపోతే ఎలా అని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలనుకున్న పలు అంశాలపై లేఖలు రాస్తున్నా పట్టించుకోవటం లేదని విమర్శించాడు. ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తరువాతనే సమావేశం అజెండాను ఖరారు చేయాలని రామకృష్ణుడు ప్రతిపాదించగా కర్నాటక, కేరళ తదితర రాష్ట్రాల ఆర్థిక శాఖల మంత్రులు మద్దతు ఇచ్చారు. లెవీ విధించేందుకు ఉద్దేశించిన టర్నోవర్ పరిమితిని ఒక కోటి నుండి కొటిన్నర రూపాయలకు పెంచే ప్రతిపాదనకు రామకృష్ణుడు మద్దతు పలికారు. జీఎస్‌టీ రిటర్న్‌లను మూడు నెలలకు ఒకసారికి బదులు త్రైమాసిక చెల్లింపులతో వార్షిక రిటర్న్ దాఖలు చేసేందుకు వీలు కల్పించడాన్ని కూడా ఆయన బలపరిచారు. రిజిస్ట్రేషన్ పరిమితిని ఇరవై లక్షల నుండి యాభై లక్షలకు పెంచటం వలన ఎంఎస్‌ఎంఈలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వాలకు కలిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలని ఆయన ప్రతిపాదించారు. ఏడువేల కోట్ల రూపాయల అపరిష్కృత ఐజిఎస్‌టి సమస్యను కూడా వెంటనే పరిష్కరించి రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలన్నారు. వివిధ కారణాల వల్ల పరిష్కారానికి నోచుకోని 7000 కోట్ల రూపాయల ఐజీఎస్టీని వెంటనే సెటిల్ చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఐజీఎస్టీని పరిష్కరించడం ద్వారా ఒక్కో రాష్ట్రానికి కనీసం 100 కోట్ల రూపాయలు వస్తుందన్నారు. రాష్ట్రాల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెటిల్ చేయాలని కోరానని తెలిపారు. ఏపీకి సంబంధించి జీఎస్టీపై ఉన్న అభ్యంతరాలను కూడా ప్రస్తావించారు. రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చకు రావడం లేదన్న విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. తదుపరి సమావేశాల్లో రాష్ట్రాల ప్రతిపాదనలను ఆధారం చేసుకుని అజెండా ఖరారు చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించి చర్చ జరిగిందని, ఫిట్‌మెంట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఏపీ నుంచి రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ఏమైతే కోరుతున్నామో, ఫిట్‌మెంట్ కమిటీ కూడా అవే ప్రతిపాదనలు చేసిందన్నారు. ఎంఎస్‌ఎంఈ గూడ్స్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్ పరిమితిని 40 లక్షల రూపాయలకు కౌన్సిల్ పెంచిందని, దీని వల్ల చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.