జాతీయ వార్తలు

ఉద్యోగానికి సీబీఐ మాజీ డైరెక్టర్ వర్మ గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించబడిన అలోక్ వర్మ అగ్నిమాపక సర్వీసులు, సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో చేరకుండా ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనను పదవీ విరమణ చేసినట్లుగా భావించి ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర సిబ్బంది సేవలు, శిక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. తనపై వచ్చిన అభియోగాలపై సమాధానం చెప్పేందుకు ఉన్నతస్థాయి కమిటీ అవకాశం ఇవ్వలేదని ఆయన లేఖలో ప్రస్తావించారు. 1979 ఐపీఎస్ బ్యాచికి చెందిన సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలోని కమిటీ వేటు వేసిన సంగతి విదితమే. ఈ నెల 31వ తేదీతో అలోక్‌వర్మ సీబీఐ డైరెక్టర్‌గా కాలపరిమితి ముగుస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అధికారి ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సీవీసీ విచారించిందన్నారు. తన వాదనలను పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా సెలవుపై వెళ్లిన స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పేరును ఆయన ప్రస్తావించకుండానే ఆరోపణలు చేశారు. ఆస్థానా ఇచ్చిన ఫిర్యాదును ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి పరిగణనలోకి తీసుకున్నట్లు అర్థమవుతోందన్నారు. తనపై రాకేష్ ఆస్థానా చేసిన ఆరోపణల పత్రాన్ని కూడా జస్టిస్ ఏకే పట్నాయక్‌కు సీవీసీ ఇవ్వలేదన్నారు. సీబీఐ దేశంలో ప్రతిష్టాకరమైన సంస్థ అని చెప్పారు. సీవీసీని అడ్డుపెట్టుకుని సీబీఐను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై పునసమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తాను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా పనిచేశానని, 40 సంవత్సరాలు సేవలు అందించానన్నారు.