జాతీయ వార్తలు

రక్షణకు సాంకేతిక దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. మన శత్రు దేశాలు కూడా సైన్యం ఆధునీకరణకు ఈ రెండు సాంకేతిక విధానాలను ప్రవేశపెడుతున్నాయని, దీనికి ఎక్కువవ్యయం చేస్తున్నాయని చెప్పారు. శుక్రవారం ఆర్మీ టెక్నాలజీ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే రక్షణ వ్యవస్థ సాంకేతీకరణ ఆలస్యమైందన్నారు. తక్షణమే ఈ రంగం ఆధునీకరణకు ఏమి కావాలో గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో ఈ దిశగా అడుగులు వేస్తామన్నారు. మన సైన్యంలో ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటాను ఎలా ప్రవేశపెట్టాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేదానిపై కూడా కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఈ రెండు సాంకేతిక వ్యవస్థలపై పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయన్నారు. వచ్చే తరంలో మిలిటరీ సాంకేతిక టెక్నాలజీతోనే పనిచేస్తుందన్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ బామ్రే మాట్లాడుతూ, టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో పాటు దానిని అవసరమైన సమయంలో వినియోగించుకునే సామర్థ్యంపై దృష్టిని సారించాలన్నారు. టెక్నాలజీని అభివృద్ధి చేయడం సవాలుతో కూడుకున్నదన్నారు. సముద్రం, భూమి, ఆకాశం, అంతరిక్షం, సైబర్ స్పేస్‌పై ఆధిపత్యం పోరు టెక్నాలజీ సహాయంతో కొనసాగుతుందన్నారు. ఇక యుద్ధాలను టెక్నాలజీ నడిపిస్తుందన్నారు. ప్రపంచ మిలిటరీ వ్యవస్థ రూపురేఖలు త్వరితగతిన మారుతున్నాయన్నారు. యుద్ధతంత్రంలో కూడా అనేక ఎత్తుగడలు వస్తున్నాయన్నారు. మానవ మేధస్సు నుంచి సైబస్ స్పేస్ వరకు అంతా టెక్నాలజీ మయమన్నారు. అకడమిక్,రక్షణ రంగం మధ్య సమన్వయం ఉండాలన్నారు. ప్రతి సిపాయిని సాంకేతిక పరిజ్ఞానంలో సుశిక్షితుడిని చేయాలన్నారు. రక్షణ ఉత్పత్తుల రంగం కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ, రక్షణ రంగంలో నిపుణులు భారత రక్షణ వ్యవస్థ ఆధునీకరణకు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ రక్షణ రంగంలో భారత్ సైన్యానికి నైపుణ్యత ఉన్న ఆర్మీగా పేరుందన్నారు. డీఆర్‌డీవో చైర్మన్ జీ సతీష్ రెడ్డి, ఇతర నిపుణులు ప్రసంగించారు.