జాతీయ వార్తలు

కూటమికి బీటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరిపించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్న మహా కూటమి ఆదిలోనే బీటలు బారింది. సమాజ్‌వాదీ, బీఎస్పీ స్వంత కూటమిని ఏర్పాటు చేసుకుంటుంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ రహిత కూటమికి కసరత్తు మొదలు పెట్టారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి శనివారం రాష్ట్ర రాజధాని లక్నోలో తమ కూటమి, పొత్తుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఈనెల 19 తేదీ నాడు కోల్‌కత్తాలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ వ్యతిరేక ర్యాలీకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఆహ్వానించలేదు. దీనితో కాంగ్రెస్ అధినాయకత్వం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. మహా కూటమికి ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ దూరం కావటం కాంగ్రెస్‌ను ఆందోళనలో పడవేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదనే నిర్ణయానికి వచ్చిన ని ఎస్పీ, బీఎస్పీ శనివారం తమ కూటమి గురించి అధికారికంగా ప్రకటించనున్నాయి. 80 లోక్‌సభ సీట్లతో దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ, మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ లక్నోలో తమ ఎన్నికల పొత్తు గురించి అధికారికంగా ప్రకటించనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకోవటం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికార ప్రకటన లక్నోలో వెలువడనుంది. అఖిలేష్ యాదవ్, మాయావతి విలేఖరుల సమావేశంలో తమ కూటమి గురించి ప్రకటించనున్నాయి. ఎస్పీ, బిఎస్పీతోపాటు అజీత్ సింగ్ నాయకత్వంలోని ఆర్‌ఎల్‌డీ, నిశాద్ పార్టీలు ఈ కూటమిలో సభ్యుల కానున్నాయి. ఎస్పీ 3, బీఎస్పీ 37, ఆర్‌ఎల్‌డీ 3, నిషాద్ పార్టీ రెండు లోక్‌సభ సీట్లలో పోటీ చేసే విధంగా ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టకూడదని ఈ కూటమి భావిస్తోంది. అంటే కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామన్న సంకేతాన్ని పరోక్షంగా పంపింది. ఎస్పీ, బీఎస్పీలు రాష్ట్రానికి చెందిన రెండు చిన్న పార్టీలు, రాష్ట్రీయ లోకదళ్, నిషాద్ పార్టీలను కూడా కలుపుకుపోయేందుకు సిద్ధం కావటంతో కాంగ్రెస్‌కు ఒంటరిపోరు తప్పేలా లేదు. ఇదిలావుంటే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్ సంబంధించినంత వరకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సుముఖత చూపించటం లేదు. టీఎంసీ ఈ నెల 19 కోల్‌కత్తాలో ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన
మహా ర్యాలీకి వ్యక్తిగతంగా వచ్చి ఆహ్వానించలేదు. మమతా బెనర్జీ ఇతర మిత్రపక్షాల నాయకులను స్వయంగా కలిసి ర్యాలీ ఆహ్వానం అందజేయగా రాహుల్, సోనియాని మాత్రం ఆమె స్వయంగా పిలవలేదు. ర్యాలీకి రావలసిందంటూ ఆమె కాంగ్రెస్ పార్టీకి ఒక లేఖ మాత్రం రాశారు. మమతా బెనర్జీ స్వయంగా వచ్చి ఆహ్వానం ఇవ్వకుండా కాంగ్రెస్‌కు లేఖ రాయటం అంటే తమను అవమానించటమేనని రాహుల్, సోనియా భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే కోల్‌కరత్తా ర్యాలీకి హాజరు కాకూడదని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అయితే జాతీయ స్థాయిలోని ప్రతిపక్ష పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం సీనియర్ నాయకులను కోల్‌కత్తా ర్యాలీకి పంపించాలని రాహుల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కోల్‌కత్తా ర్యాలీకి బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల అధినాయకులందరు హాజరవుతుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు హాజరు కాకపోవటం ఏమిటన్నది ప్రశ్న. రాహుల్ నాయకత్వంలో పని చేయటం తనకు ఎంత మాత్రం సాధ్యం కాదని మమతా బెనర్జీ ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పటంతోపాటు ఈ విషయాన్ని ఆమె సోనియాకి కూడా చెప్పారు. ఈ కారణం చేతనే ఆమె కోల్‌కత్తా ర్యాలీకి రాహుల్, సోనియాను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించలేదని అంటున్నారు. మహా కూటమి సభ్యులైన చంద్రబాబు నాయుడు, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎన్‌సీ అధినాయకుడు ఫరూక్ అబ్దుల్లా, ఇతర పార్టీల సీనియర్ నాయకులు హాజరవుతున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన రేపుతున్నది.