జాతీయ వార్తలు

అంతర్గత భద్రత పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లఖింపూఖేరి (ఉత్తరప్రదేశ్), జనవరి 14: పొరుగునున్న పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల అస్థిర కార్యకలాపాల వల్ల కాశ్మీర్ ఓ సవాల్‌గానే పరిణమిస్తోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలకు పాల్పడ్డా సరిహద్దుల్లో అరాచకాలకు ఒడిగడుతున్నా భారత దళాలు సమన్వయంతో తిప్పికొడుతున్నాయని సోమవారంనాడు ఇక్కడ మీడియాతో అన్నారు. సైనికులు, సీఆర్‌పీఎఫ్, కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరోలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఎప్పటికప్పుడు పాక్ ఆటలు కట్టిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలో నక్సలిజం కూడా క్రమంగా బలహీనపడుతోందని, గత నాలుగున్నరేళ్లలో 50 శాతానికి పైగా నక్సల్ కార్యకలాపాలు తగ్గిపోయాయని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అలాగే ఈశాన్య భారతంలోనూ తీవ్రవాద కార్యకలాపాలు 80 శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంమంత్రి తెలిపారు. అంతర్గత భద్రతను పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలే ఈ సానుకూల పరిణామాలకు కారణమైందని ఆయన అన్నారు. అలాగే కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఒక్క ఉగ్రవాద సంఘటన కూడా దేశంలో జరగకపోవడానికి కారణం దేశీయ బలగాలు పటిష్టంగా అనునిత్యం అప్రమత్తంగా ఉండడమేనని ఆయన అన్నారు. అలాగే ఆర్థికాభివృద్ధిలో కూడా భారతదేశం పరుగులు పెడుతోందిని, అత్యంత వేగంగా ప్రగతి సాధిస్తున్న దేశాల్లో ఒకటిగా మారిందని అన్నారు. 2030 నాటికి ప్రపంచంలో మొదటి మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి అవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. ఈ నాలుగున్నరేళ్లలో దేశ ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే ఆయుష్మాన్ సహా ఎన్నో సంక్షేమ, ప్రగతిశీల కార్యకలాపాలను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించిందని రాజ్‌నాథ్ తెలిపారు. ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్ వల్ల 7.5 లక్షల మంది ప్రయోజనం పొందారని అన్నారు.