జాతీయ వార్తలు

చట్ట ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూ కేసులో విద్యార్థినేతలపై దేశద్రోహం కింద చార్జిషీట్ దాఖలు చేయడాన్ని మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ తప్పుపట్టారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ తదితరులపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒక సభలో మాట్లాడిన వాటిని వక్రీకరించి తీవ్రమైన చార్జిషీట్ దాఖలు చేయడం దారుణమని బుధవారం ఆయన అన్నారు. సంఘటన జరిగి మూడేళ్లయిన తరువాత ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కుమార్, మరో తొమ్మిది మంది జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. ‘ఐపీసీ 124ఏ సెక్షన్‌కు చార్జిషీట్ పూర్తి విరుద్ధం. ఒక విధంగా చట్టాన్ని ఉల్లంఘించడమే’అని విమర్శించారు. 1200 పేజీల చార్జిషీట్‌లో ఏడుగురు కాశ్మీరీల పేర్లు ఉండడం దుర్మార్గమని ఫైజల్ ట్వీట్‌లో మండిపడ్డారు.