జాతీయ వార్తలు

హిరానీ లాంటి వ్యక్తిపై ఆరోపణలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జనవరి 16: లైంగిక వేధింపుల ఆరోణలు తగ్గుముఖం పట్టాయనుకున్న తరుణంలో ఓ మహిళ బాలీవుడ్‌లో పెద్ద బాంబు పేల్చారు. అయితే రాజ్‌కుమార్ హిరానీ అలాంటి వ్యక్తి కాదని ఎందరో బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, సంజు చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అయితే రాజ్‌కుమార్ హిరానీ అలాంటి వారు కాదని తాజాగా బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ ఆయనకు అండగా నిలుస్తున్నారు. సంజు సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో హిరానీ తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించారు. అయితే ఇండస్ట్రీ మొత్తం హీరానీ వ్యక్తిత్వం తమకు తెలుసునంటూ ఆయనకు నైతిక మద్దతు తెలిపారు. నటి దియామీర్జా, బోనీ కపూర్, అర్షద్ వార్సీ, ఇమ్రాన్ హష్మీ ఇది వరకే మద్దతు ప్రకటించగా, ఆ జాబితాలో రచయిత జావేద్ అఖ్తర్ చేరారు. రాజ్‌కుమార్ చాలా మంచివాడు. ఆయనపై ఆరోపణలు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదు. హిరానీ ఎప్పటికీ అలాంటి పనిచేయడు అన్నారు. పుఆయన ఏ ఒక్కరితో దురుసుగా ప్రవర్తించడం చూడా తాను చూడలేదన్నారు. అలాంటిది అకస్మాత్తుగా ఒకరు వచ్చి ఆయనపై ఆరోపణలు చేస్తే నమ్ముతారా అని ప్రశ్నించాడు. విషయం తెలిసిన తర్వాతే ఒకరి వ్యక్తిత్వంపై ఓ నిర్ణయానికి రావాలని, అప్పటిదాకా వేచి చూడటం అందరికీ మంచిదని సూచించాడు.
హీరానీపై వచ్చినవి కేవలం ఆరోపణలేనని, నిజాలు తేలేవరకు వౌనం పాటించాలని అన్నారు. ఆరోపణలు వచ్చిన వెంటనే ఆవేశంతో స్పందించకుండా, నిజం తేలేదాకా వేచిచూసే ధోరణి పాటించాలని సలహా ఇచ్చాడు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా హిరానీ వీటిని కొట్టిపారేశారు కూడా. నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఈ విషయం గురించి కామెంట్ చేయకపోవడమే మంచిని అని అభిప్రాయ పడ్డాడు. ‘నేను 1965లో సినిమా పరిశ్రమకు వచ్చాను. ఇనే్నళ్ల కాలంలో అందరితో కలిసి పనిచేశాను. చాలా మంది గురించి నాకు బాగా తెలుసు. అందులో ముఖ్యంగా రాజ్‌కుమార్ హిరానీ లాంటి మంచి వ్యక్తి నాకు నచ్చిన వారిలో ముందుంటాడు. పరిశ్రమలో తను కలుసుకున్న అత్యంత మంచి వ్యక్తులలో హిరానీ ఒకరు’ అని వ్యాఖ్యానించారు జావేద్ అఖ్తర్. మీటూ విషయంలో పరిశ్రమ నిశ్శబ్దంగా ఉంది. కానీ హిరానీ లాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అంతా అలర్టయ్యారు. హిరానీకి తమ మద్దతు ప్రకటించారు.