జాతీయ వార్తలు

గిరిజన మండలికి నిధులు విడుదల చేయని బీజేపీ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగర్తలా, జనవరి 17:త్రిపుల గిరిజన స్వయంప్రతిపత్తి మండలికి నిధులు కేటాయించనందుకు నిరసనగా వారం రోజుల పాటు ఆందోళన నిర్వహించనున్నట్లు సీపీఎం ప్రకటించింది. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన సీపీఎం నేత బిజన్‌ధార్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం స్వయంప్రతిపత్తి ఉన్న గిరిజన మండలికి రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. పక్షపాత ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గత ఏడాది మార్చి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందన్నారు. బడ్జెట్‌లోనిధులను రూ.582 కోట్ల నుంచి రూ.117 కోట్లకు తగ్గించారన్నారు. ఈ నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేయడం లేదన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. తక్షణమే గిరిజన మండలి అవసరాలు తీర్చేందుకు రూ.95 కోట్లను విడుదల చేయాలన్నారు. గిరిజన మండలి ప్రాంతాల్లో పంచాయతీ వ్యవస్థలో మూడంచెల విభాగాన్ని ప్రవేశపెట్టాలన్నారు. కొక్ బరాక్ అనే స్థానిక గిరిజన భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్పించాలన్నారు. ఈ భాషను పరిరక్షించేందుకు ఇప్పటికే ఆరవషెడ్యూల్‌లో చేర్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల పట్ల వివక్ష తగదని ఆయన కోరారు. గిరిజన హక్కుల సంరక్షణకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.