జాతీయ వార్తలు

సీబీఐ ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐలో సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద అధికారిగా పేరుతెచ్చుకున్న స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్ శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మనీషా కుమార్ సిన్హాలను సీబీఐ నుంచి బదిలీ చేశారు. సీబీఐలో వీరి నిర్ణీత పదవీ కాలం పూర్తి కాకుండానే బదిలీ వేటు వేశారు. స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేశారు. పదవి నుంచి తొలగించిన మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ, రాకేష్ ఆస్థానా మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో, గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన ఈ ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా సెలవుపై వెళ్లాలని కేంద్రం ఆదేశించిన విషయం విదితమే. బదిలీ వేటుపడిన మరో అధికారి సిన్హా కూడా వివాదాస్పద అధికారిగా ముద్ర ఉంది. ఆస్థానాపై చేపట్టిన దర్యాప్తులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, కేంద్ర మంత్రి హరీభాయ్ పత్రీభాయ్ చౌదరి, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీచౌదరి జోక్యం చేసుకుంటున్నారంటూ సుప్రీంకోర్టులో సిన్హా పిటిషన్ దాఖలుచేసిన విషయం విదితమే. బదిలీ అయిన మరో జేడీ ఏకే శర్మ సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ సన్నిహితుడనే ప్రచారం ఉంది. ఆస్థానా, శర్మ ఇద్దరూ కూడా గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారులు కావడం గమనార్హం. సిన్హా 2000 సంవత్సరం ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అదికారి.