జాతీయ వార్తలు

ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం వృద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వేతనాల్లో పదిశాతం వృద్ధి ఉంటుందని ఓ నివేదికలో స్పష్టమైంది. ద్రవ్వోల్బణం కీలక పాత్ర పోషిస్తుందని, ఐదు శాతం పెరుగుదల ఉంటుందని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ‘కార్న్ ఫెర్రీ’ వెల్లడించింది. ఆసియాలో మొత్తంగా చూసే భారత్‌లోనే ఉద్యోగుల వేతనాలు మెరుగ్గా ఉన్నాయని సంస్థ పేర్కొంది. ‘గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2019లో వేతనాల పెంపులో పదిశాతం వృద్ధి ఉంటుంది. గత ఏడాది తొమ్మిది శాతం ఉండేది. అలాగే ద్రవ్యోల్బణం 4.7 శాతం నుంచి 5 శాతానికి పెరుగుదల ఉంటుంది’అని కార్న్‌ఫెర్రీ ఇండియా చైర్మన్, రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్‌నీత్ సింగ్ వెల్లడించారు. కంపెనీ యాజమాన్యాలు అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యాపార మెళకువలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవల్సి ఉందని సింగ్ పేర్కొన్నారు.