జాతీయ వార్తలు

విదేశీ పెట్టుబడులపై దర్యాప్తు చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చెసిన తరువాత, ఒక ఏడాది కాలంలో గేమిన్ ద్వీపం నుండి మన దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లపై దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన డబ్బే మొదట దేశం నుండి బైటికి వెళ్లి, ఆ తరువాత ఎఫ్‌డీఐ రూపంలో మన దేశంలోకి తిరిగి వచ్చిందని గురువారం ఏఐసీసీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు. దేశ భద్రతా వ్యవహారాల సలహాదారు అజీత్ దోవాల్ కుమారులు వివేక్ దోవాల్, శౌర్య దోవాల్ పన్నుల స్వర్గం గేమిన్ ద్వీపంలో జీఎన్‌వై ఆసియా ఫండ్, జీయూస్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ అడ్వైజర్స్ సంస్థలను ప్రారంభించారని అన్నారు. అనంతరం కేవలం ఒక్క సంవత్సరంలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలోకి రావడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. 2000 నుండి 2017 వరకు గేమిన్ ద్వీపాల నుండి మన దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు దాదాపు ఎనిమిది వేల కోట్లుకాగా, పెద్ద నోట్లరద్దు అనంతరం కేవలం ఒక్క సంవత్సరంలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు రావడం ఆశ్చర్యంగా ఉన్నదని జైరామ్ రమేష్ చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 నవంబర్ 8 తేదీ నాడు పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత కేవలం 8 రోజులకు వివేక్ దోవాల్ గేమిన్ ద్వీపంలో జీఎన్‌వై ఆసియా ఫండ్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆ తరువాత నాలుగు నెలల నుండి ఈ ద్వీపం నుండి మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం ప్రారంభమైందని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఒక్క సంవత్సరంలో గేమిన్ ద్వీపం నుండి మన దేశంలోకి వచ్చిన ఈ పెట్టుబడుల వివరాలను రిజర్వు బ్యాంకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. వివేక్ దోవాల్ ప్రారంభించిన జీఎన్‌వై ఆసియా ఫండ్‌లో డైరక్టర్‌గా నియమితులైన డాన్ బ్యాంక్స్ పేరు పనామా పేపర్లు, ప్యారజైజ్ పేపర్లలో ఉన్నదనేది మరిచిపోరాదని జైరాం రమేష్ అన్నారు. పనామా పేపర్ల మూలంగా పొరుగుదేశం ప్రధాన మంత్రి రాజీనామా చేయవలసి రావడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. వివేక్ దోవాల్ ప్రారంభించిన జీఎన్‌వై ఆసియా ఫండ్‌కు శౌర్య దోవాల్‌కు చెందిన జీయూస్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ఆడ్వైజర్స్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది కూడా వెల్లడించాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. తాము నిజాయితీకి, పారదర్శకతకు మారుపేరు అని చెప్పుకునే నరేంద్ర మోదీ ప్రభుత్వం గేమిన్ ద్వీపం నిధులకు సంబంధించిన అన్ని వివరాలు బైట పెట్టాలని ఆయన అన్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజీత్ దోవాల్ 2010లో బీజేపీకి ఇచ్చిన ఒక నివేదకలో పన్నుల స్వర్గంలో జరిగే వాలాదేవీలను వెళ్లడించాలని డిమాండ్ చేయటాన్ని జైరాం రమేష్ ఉటంకిస్తూ, ఇప్పుడైనా ఈ వివరాలు వెళ్లడిస్తారా? అని ప్రశ్నించారు. అజీత్ దోవాల్ రాజీనామా చేయాలని కోరుతున్నారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ, మొదట వివరాలు వెల్లడిస్తే ఆ తరువాత రాజీనామా డిమాండ్ గురించి ఆలోచిస్తామన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్‌షా, ఆ పార్టీకి చెందిన నాయుకలు కుమారులు కూడా చాలా గొప్పవారంటూ జైరాం రమేష్ వ్యంగ్య బాణాలు విసిరారు.