జాతీయ వార్తలు

సంక్షోభం కొలిక్కి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 17: కర్నాటక కాంగ్రెస్- జెడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడ్డ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎరలో ఉన్నట్టుగా భావిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం తిరిగిరావడంతో కుమరస్వామి సారథ్యంలోని సంకీర్ణ సర్కార్‌కు కొంత ఊరట కలిగినట్టయింది. ముఖ్యంగా శుక్రవారం అత్యంత కీలకమైన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరుగనున్న తరుణంలో ఈ ఎమ్మెల్యేలు తిరిగిరావడంతో సంక్షోభం నుంచి గట్టెక్కినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తిరిగొచ్చిన ఎమ్మెల్యేలు తాము పార్టీకి విధేయంగా ఉంటామని చెప్పడం గమనార్హం. దీనితో సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి కొంత ఊరట కలిగినట్టయింది.కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరత్వంపాలు చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు ఫలించవని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలను హర్యానా హోటల్‌లో బందీలుగా ఉంచారన్నారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపరిచేందుకు అన్ని కుట్రలకు బీజేపీ పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా బీజేపీ దిగజారిందన్నారు. కేంద్రం పాల్పడుతన్న నీచమైన ఎత్తుగడలకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. మీడియాను దుర్వినియోగం చేసి తమ పబ్బం గడుపుకుందామని చూస్తున్నారన్నారు. అధికారంలోకి రావాలన్న భ్రమల్లో బీజేపీ కొట్టుమిట్టాడుతున్నారన్నారు. సంక్రాంతికి ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేశారన్నారు. ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అధికారం దాహంతో సతమతమవుతున్నారన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయడాన్ని చూసి ఓర్వలేక 24 గంటలు ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరవుతీవ్రత ఉందని, సహాయక చర్యలను ముమ్మరం చేశామన్నారు. ప్రభుత్వానికి అండగా ఉండకుండా కూలదోసే ప్రయత్నాలు దారుణమన్నారు. ఎమ్మెల్యేలను ఐదు నక్షత్రాల హోటల్లో ఉంచారన్నారు. రైతుల సంక్షేమమే పనిచేస్తున్నామని బీజేపీ చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. హర్యానాలో కరవుపై చర్చలా, ఐదు నక్షత్రాల హోటళ్లలో ఎమ్మెల్యేలను ఉంచడానికి కారణమేంటి అని ఆయన ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని బీజేపీ తరచుగా తమ పార్టీని విమర్శిస్తుంటుందని, కాని బీజేపీ ఎందుకు ఎమ్మెల్యేలను దూరంగా ఉన్న రాష్ట్రానికి తరలించి బందీలుగా ఉంచిందన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలను వలవేసి పట్టుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు బీజేపీని క్షమించరన్నారు.