జాతీయ వార్తలు

మీకు నైతిక విలువలు ఉన్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: కేంద్రంలో ప్రజాభీష్టంమేరకు ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు విపక్ష పార్టీలు, కొంత మంది నేతలు అప్రజాస్వామిక రీతిలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. అధికార దాహంతో ఈ నేతలు అవాకులు చవాకులు వాగుతూ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన మంత్రి జైట్లీ తన అభిప్రాయాలను ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. కేంద్రం అసలేమీ చేయలేదని, ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారన్నారు. ప్రతికూల ఆలోచనా వ్యక్తిత్వం ఉన్న ఈ నేతలు కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై అపనిందలు వేస్తూ ప్రచారం చేయడం దినచర్యగా మారిందన్నారు. వీరికి దేశ ప్రయోజనాలు కూడా కాభట్టవన్నారు. ద్వంద్వ ప్రమాణాలతో ప్రతిపక్ష నేతలు పనిచేస్తున్నరన్నారు. ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు, రాఫెల్ డీల్ తదితర అంశాలపై ఎంతకాలమని అవాస్తవాలను ప్రతిపక్షనేతలు మాట్లాడుతారన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, చర్యను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ తరహా చేష్టలు ప్రజాస్వామ్యానికి హానికలిగిస్తాయన్నారు. జస్టిస్ లోయా కేసు, సీబీఐ అంశం, ఆర్‌బీఐ , న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఇలా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్టసంకల్పంతో పరస్పర విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము పాలించడం కోసమే పుట్టామని భావించే వారి వల్ల వ్యవస్థకు ప్రమాదమన్నారు. కొంత మంది సిద్ధాంత భావజాల చట్రంలో చిక్కుకుని బాధపడుతున్నారన్నారు. వీరందరూ కలిసి ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ మధ్య కాలంలో జీఎస్‌టీ నుంచి ఈబీసీ రిజర్వేషన్ల వరకు అన్ని అంశాలపై వీరు ప్రభుత్వంపై నీలాపనిందలు వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఒక దురదృష్టకర సమయంలో జస్టిస్ లోయా మృతి చెందితే ఆ అంశాన్ని కూడా వివాదస్పదం చేసి రాజకీయంగా లాభపడేందుకు విపక్షాలు ప్రయత్నించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీబీఐ లాంటి వ్యవస్థలో అంతర్గత పోరు జరుగుతుంటే సార్వభౌమాధికార పరిరక్షణలో భాగంగా కేంద్రం రంగంలోకి దిగి వ్యవస్థను బాగు చేసిందన్నారు. ఈ నేతల అత్యుత్సాహంతో న్యాయ వ్యవస్థకు కూడా హాని చేస్తున్నారన్నారు. అడ్డూ అదుపులేకుండా మాట్లాడే పద్ధతిని మానుకోవాలన్నారు.