జాతీయ వార్తలు

రాజస్థాన్ అసెంబ్లీలో గలాభా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 17: రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక రంగంలో గత తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని గవర్నర్ కల్యాణ్ సింగ్ అన్నారు. యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ బీజేపీ నేత కల్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన గురువారం శాసనసభ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో గలాభా చోటు చేసుకుంది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన హనుమాన్ బెనివాల్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా అంతరాయం కల్పించేందుకు ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగం ముగుస్తుండగా, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. లోక్ తాంత్రిక్ ఎమ్మెల్యేలు పోడియంలోకి ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దూసుకెళ్లి అసెంబ్లీ సెక్రటరీ పక్కన ఉన్న ప్లాట్‌ఫారంను ఎక్కి నినాదాలు చేశారు. గవర్నర్ కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ వసుంధర రాజే ప్రభుత్వ హయాంలో ఆర్థికాభివృద్ధిరేటు తగ్గిందన్నారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొందని, ఈ రంగంలో అభివృద్ధి గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్రంలో రుణాలు గత ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్ల నుంచి రూ.3.08 కోట్లకు పెరిగాయన్నారు. గత ప్రభుత్వానికి దార్శనికత, అభివృద్ధి అజెండా లేవని ఆయన వసుంధర రాజే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. వచ్చే వంద రోజులకు చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణాలను మాఫీచేసిందన్నారు. రైతులు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పశుసంవర్ధక రంగంలో ఉపాధిని రెట్టింపు చేస్తామన్నారు. జాతీయ ఉపాధి హామీపథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రజలకు వైద్య రంగంలో నాణ్యమైన సేవలు అందిస్తామని, ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.