జాతీయ వార్తలు

భయం గుప్పిట కథువా బాధిత కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: కథువా సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏడాది క్రితం ఇదే రోజు జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఒక మైనార్టీ గిరిజన తెగకు చెందిన ఒక అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల పసిపాపపై కామాంధులు ఒక మందిరంలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ పాపను నిర్థాక్షిణ్యంగా చంపేశారు. ఈ కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట కోర్టు విచారిస్తోంది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆలయ పర్యవేక్షకుడు, ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ప్రపంచం మర్చిపోయినా, ఈ ఉదంతం ఇప్పటికీ కథువా గ్రామస్తులను వెంటాడుతోంది. కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ షాక్ నుంచి కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఇంత జరిగిన తర్వాత నా పిల్లలను ఎలా బయటకు పంపించాలని ఆ బాలక తండ్రి ప్రశ్నించారు. కోర్టు కేసు ఎంత వరకు వచ్చిందని అడిగారు. సుప్రీంకోర్టు ఆదేశంతో ఈ కేసును పఠాన్‌కోట కోర్టు విచారిస్తోంది. క్రైమ్ బ్రాంచి పోలీసులు రంగంలోకి దిగి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఒక బాలుడుకూడా ఉన్నాడు. పోలీసులు ఐపీసీ 120-బీ, 302, 376-డీ, 328 కింద కేసులు నమోదు చేశారు. గత ఏడాది జనవరి 10వ తేదీన బాలికను దుండగులు కిడ్నాప్ చేసి 14వ తేదీన హత్య చేశారు. ఈ కేసులో నిందితుడు సం జీరామ్ పోలీసులు కేసుపెట్టకుండా ఉండేందుకు నాలుగు లక్షల రూపాయల లంచాన్ని మూడు వాయిదాల్లో ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.