జాతీయ వార్తలు

ఏ రాజకీయ పార్టీలోనూ చేరను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 18: తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని కాని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సినీనటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లోపించిందని, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తాను బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరినా మూడు నెలల కంటే మించి ఉండలేనన్నారు. తాను ప్రజల వాణిని బలంగా వినిపించే నేతగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. విధేయత లేని ప్రజల పట్ల కూడా ఆగ్రహం ఉండాలన్నారు. కర్నాటకలో ఏ పార్టీ, కూటమిల పట్ల తనకు నమ్మకం లేదన్నారు. ఈ పార్టీలు కీచులాడుకుంటున్నాయన్నారు. బీజేపీ అనే పార్టీ విధేయత, చిత్తశుద్ధిలేని నేతల పార్టీ అన్నారు. వీరు తమకు తాము గోభక్తిపరులమని చెప్పుకుంటారన్నారు. మకర సంక్రాంతి రోజు బీజేపీ ఎమ్మెల్యేలు కర్నాటకలో ఉండకుండా హర్యానా హోటళ్లలో మకాం చేశారన్నారు. తాను బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సీటు నుంచి పోటీచేయడం వల్ల లౌకిక పార్టీ అభ్యర్థుల ఓట్లకు గండిపడుతుందనే వాదనను ఆయన కొట్టివేశారు. తన గెలుపు కోసం సెక్యులర్ పార్టీలు కృషి చేయాలన్నారు. మతతత్వశక్తులకు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమిలో చేరేందుకు తాను వ్యతిరేకం కానన్నారు. తాను పుట్టిపెరిగి చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కారణమైన బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సీటు నుంచి పోటీచేస్తానన్నారు. బీజేపీ వత్తిడి వల్ల తనకు బాలీవుడ్ చిత్రపరిశ్రమ సినిమాల్లో పాత్రలు ఇవ్వడం లేదన్నారు.