జాతీయ వార్తలు

ఆఫ్రికా దేశాలకు భారత్ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 19: ఆఫ్రికా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ అభివృద్ధి, సామాజిక సాధికారత సాధనలో కలిసి పనిచేస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. శనివారం ఇక్కడ విభ్రాంత్ గుజరాత్ గ్లోబల్ సదస్సు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆఫ్రికా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ విదేశాంగ వ్యవహారాల్లో ఆఫ్రికాకు అగ్ర ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆఫ్రికా దేశాలతో ఆర్థిక సంబంధాలు, సాంకేతిక పరిజ్ఞానం సహకారంపై ఆసక్తిగా ఉందన్నారు. భారత్, ఆఫ్రికాదేశాలకు మధ్య సంబంధాలు అవినాభావమైనవన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎనలేని ప్రాధాన్యత ఉందన్నారు. కాకతాళీయంగా నెల్సన్ మండేలా శతజయంతి ఉత్సవాలు కూడా ఈ ఏడాది జరుగుతున్నాయన్నారు. ఆఫ్రికా విముక్తికి పోరాడిన మహాత్మాగాంధీ ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం అంకితమైందన్నారు. గత నాలుగున్నరేళ్లలో రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, ప్రధానమంత్రితో పాటు ఇతర మంత్రలు 29 సార్లు ఆఫ్రికా దేశాల్లో పర్యటనలు చేశారన్నారు. భారత్‌కు ఆఫ్రికా దేశాలు విశ్వసనీయమైన వాణిజ్య భాగస్వామి అన్నారు. ఉభయ దేశాలు ప్రాధాన్యత రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. 2017-18లో ఇరు దేశాల మధ్య వాణిజ్య విలువ 62.66 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 22 శాతం వాణిజ్యం పెరిగిందన్నారు. వివిధ వస్తువులపై సుంకాలను భారత్ ఎత్తివేసిందని, ఈ సదుపాయాన్ని 38 ఆఫ్రికాదేశాలకు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అగ్రిమెంట్ వల్ల ఉభయ దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.