జాతీయ వార్తలు

రక్షణకు వజ్ర పుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హజీరా (గుజరాత్), జనవరి 19: దేశంలో మొదటి సారిగా ప్రైవేట్ రంగంలో శక్తివంతమైన హౌట్జిర్ గన్స్ కే9వజ్రను తయారు చేసే ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థ రూ.4500 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత రక్షణ రంగం స్వావలంభనను అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న కృషిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యసాధన దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. దేశ రక్షణకు అత్యంత శక్తివంతమైన ఈ ఆయుధాలు ఉపకరిస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్‌లో వీడియోను కూడా షేర్ చేశారు. ఎల్ అండ్ టీ సంస్థ ఆయుధాల తయారీ వ్యవస్థను ఉన్నత ప్రమాణాలతో తయారు చేసిందన్నారు. ఎల్ అండ్ టీకి చెందిన 755 ఎకరాల హజీరా మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్‌లో 40 ఎకరాల ప్రాజెక్టును నెలకొల్పారు. 42 వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీకి రక్షణ మంత్రిత్వశాఖ ఈ స్థాయిలో కాంట్రాక్టును మంజూరు చేయడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కొరియా రక్షణ శాఖ మంత్రి వాగ్ జుంగ్ హంగ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎఎం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ఇంజనీరింగ్ నిపుణులు మాట్లాడుతూ 400 చిన్న తరహా పరిశ్రమలు ఈ గన్స్ తయారీకి ఉపయోగపడే 13వేల విడిభాగాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించామన్నారు. ఒక్కో గన్ బరువు 50 టన్నులు ఉంటుంది. 47 కేజీల బాంబులను 43 కి.మీ దూరం నుంచి పేల్చగలవు. వంద ట్యాంకులకు గాను ఇంతవరకు 10 ఆయుధ గన్ ట్యాంకులను సరఫరా చేసినట్లు వారు చెప్పారు.
చిత్రం..లార్సన్ అండ్ టబ్రో సంస్థ నిర్మించిన స్వయం చోదిత కే-9 వజ్ర హావిట్జర్ శతఘ్నిలో ప్రధాని మోదీ