జాతీయ వార్తలు

ముగిసిన శబరిమల యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల/తిరువనంతపురం, జనవరి 20: పర్వదినాలు ముగియడంతో శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయాన్ని ఆదివారం పూజలు అనంతరం మూసివేశారు. గత రెండు నెలలుగా 10-50 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఇక్కడ జరిగిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. శబరిమల ఆలయంలో మహిళలపై ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని రాష్ట్రప్రభుత్వం, ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదంటూ ఆందోళన కారులు గత రెండు నెలలుగా సచివాలయం ఎదుట దీక్షలు చేశారు. శబరిమల ఆలయం పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసుల భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెద్దఎత్తున సాగాయి.
కాగా పందలం రాజకుటుంబీకుడు పి రాఘవ వర్మ పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం ఉదయం 6.15 గంటలకు దేవాలయాన్ని అర్చకులు మూసివేశారు. హరివరాసనం అంటూ భక్తితో భక్తులు గీతాలను అలపించారు. 67 రోజులపాటు జరిగిన శబరిమల యాత్ర ఆదివారంతో ముగిసినట్లు అర్చకులు ప్రకటించారు. ఫిబ్రవరి 13వ తేదీన ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు శబరిమల ఆలయంలో 10-50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ప్రవేశానికి అర్హత ఉందని తీర్పు ఇచ్చింది. దీంతో సనాతనవాదులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తలెత్తింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సనాతన వాదుల వాదనలను బలపరిచాయి. ఆందోళన కారుల నిరసనలను సైతం లెక్కచేయకుండా కనకదుర్గ, బిందు అనే యుక్త వయస్సులోన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవడం విశేషం. దాదాపు 51 మంది మహిళలకు దర్శనం కల్పించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.