జాతీయ వార్తలు

ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవాసభారతీయులకు ప్రాక్సీ ఓటింగ్, సైన్యంలో పనిచేస్తున్న పురుష, మహిళా సైనికాధికారుల మధ్య తేడాలేకుండా వారి జీవిత భాగస్వాములకు ఓటు హక్కును కల్పించే బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ బిల్లులను లోక్‌సభ గత ఏడాది ఆగస్టులో ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం లభించాల్సి ఉంది. ఈసారి అన్ని పెండింగ్ బిల్లులను ఆమోదించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. ప్రవాసభారతీయులకు కూడా ఓటు హక్కునుకల్పించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. విదేశాంగ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం దాదాపు 3.10 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. వారికి ఈ ఓటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదు. కాని ప్రాక్సీ ఓటింగ్‌కు మొగ్గుచూపింది. ప్రాక్సీ అంటే వారి తరఫున మరొకరు ఓటు వేయవచ్చు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న పురుష జవాన్ల భార్యలకు ఓటు హక్కు ఉంది. మహిళలు కూడా సైన్యంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వారి జీవిత భాగస్వాములకు ఓటు హక్కు లేదు. స్ర్తి, పురుషుల మధ్య తేడాను తొలగించి అందరికీ ఓటు హక్కును కల్పించాలని కేంద్రం భావిస్తోంది. వీరిని సర్వీసు ఓటర్లు అంటారు. ఈ కేటగిరీలో విదేశాల్లో రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఓటు హక్కు లభిస్తుంది.