జాతీయ వార్తలు

మోదీకి ఎదురుగాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: గత నాలుగున్నర ఏళ్లలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఢిల్లీకి చేసిందేమీ లేదని పీసీసీ అధ్యక్షురాలు షీలాదీక్షిత్ అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మోదీ జనాకర్షక శక్తి ఏమాత్రం పనిచేయదని ఆదివారం ఇక్కడ స్పష్టం చేశారు. 2014లో సాధించిన ఫలితాలు ఇక్కడ ఎంతమాత్రం ప్రతిఫలించే అవకాశం లేదని ఆమె తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మోదీపట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఖాయమని దీక్షిత్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ త్వరితగతిన పూర్వవైభవాన్ని సంతరించుకుంటోందని పేర్కొన్న ఆమె ‘లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆప్‌తో మేం ఎన్నికల పొత్తు కుదుర్చుకునే అవకాశమేలేదు’అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంతమాత్రం విశ్వసనీయమైంది కాదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ధ్వజమెత్తిన దీక్షిత్ ఇటీవల ఎంపీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ సాధించిన విజయంతో రాహుల్ నాయకత్వం పట్ల నేతలు, కార్యకర్తలో నమ్మకం పెరిగిందని అన్నారు.
రాహుల్‌లో ఓ బాధ్యతాయుతమైన నాయకుణ్ని అవసరాన్ని బట్టి కఠిన నిర్ణయాలు తీసుకోగల అధినేతను పార్టీ శ్రేణులు చూస్తున్నాయని తెలిపారు. దీని దృష్ట్యా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను కనబరుస్తుందని 80ఏళ్ల షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు నేరుగా బదులివ్వకుండా‘ఈ నాలుగున్నర ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, తప్పుడు నిర్ణయాలకు దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు’అని స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్న ఆమె ‘కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఆరితేరిన పార్టీ. ప్రగల్బాలు, ఆడంబరాలు ఈ పార్టీకి పట్టవు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తామన్న నమ్మకం మాకుంది’అని అన్నారు.