జాతీయ వార్తలు

దేశీయంగా రక్షణ ఉత్పత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచనాపల్లి, జనవరి 20: దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తుల తయారీ ప్రోత్సాహకంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను దేశ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రారంభించారు. 3,038 కోట్లను పెట్టుబడిగా పెడుతున్న ఈ కారిడార్‌లో ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వరుసగా 2కోట్లు, 3-5 కోట్లు, 140.5 కోట్లు, 150 కోట్లు పెట్టుబడి పెడుతుండగా, ప్రైవేట్ కంపెనీలైన టీవీఎస్, డాటా పాటర్న్స్, ఆల్ఫా డిజైన్స్ 50, 75, 100 కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నాయి.
ప్రముఖ అంతర్జాతీయ రక్షణ సంస్థలలో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ కూడా ఈ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటుకు మంచి స్పందన వస్తోందని, ప్రస్తుతం చెన్నై, హోజూర్, సేలమ్, కోయంబత్తూరు, తిరుచరాపల్లి కేంద్రాలుగా కార్యకలాపాలను కొనసాగిస్తుందని, అయితే దీనిని పాలక్కాడ్ వరకు విస్తరించాలని పలు విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ ఐదు నగరాలకే ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని స్పష్టం చేసినట్టు ఆమె చెప్పారు.
ఈ డిఫెన్స్ కారిడార్‌లను ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేశామని, దీంతో రక్షణ పరికరాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. వివిధ రక్షణ పరికరాల యూనిట్‌లతో అనుసంధానం చేయడానికే ఈ కారిడార్‌ను ఏర్పాటు చేసిననట్టు తెలిపారు. కాగా, దేశీయంగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయానికి దేశంలో రెండు డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత ఏడాది పిబ్రవరిలో బడ్జెట్ సమావేశం సందర్భంగా ప్రకటించిన మేరకు తమిళనాడులో రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 500 పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, మంత్రులు, అధికారులు, తమిళనాడు రక్షణ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
చిత్రం..తమిళనాడులో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రారంభిస్తున్న నిర్మలా సీతారామన్