జాతీయ వార్తలు

ఐదేళ్లలో ఎన్నో అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆర్థికంగా బలహీనమైన ఐదు దేశాల నుంచి ఇప్పుడు భారతావనీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఇక్కడ మాట్లాడిన మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఈ నాలుగున్నర ఏళ్లలో సాధించిన విజయాలపై ప్రసంగించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఐదేళ్ల సవాళ్లు’ అన్న చర్చ నేపథ్యంలో మోదీ మాట్లాడారు. గతంలో కుంభకోణాలతోనే భారత ప్రభుత్వాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల ప్రధాన శీర్షికలకు ఎక్కేవన్న మోదీ ‘ఇప్పుడు భారత్ పథకాలు, అభివృద్ధి గురించి అన్ని దేశాలూ శ్లాఘిస్తున్నాయి’ అని అన్నారు. కుంభకోణాల గురించి ఎక్కడా చర్చేలేదని భారత్ అభివృద్ధిపైనే అన్ని దేశాలూ దృష్టిపెట్టాయని తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో స్కామ్‌ల నుంచి కొత్త స్కీమ్‌లకు భారత్ ఎదిగిందని అన్నారు. కుంభకోణాలతో పాటు విద్యుత్ కొరత, ఆర్థిక సంక్షోభాలే సమస్యలుగా ఒకప్పుడున్న భారతావాణి ఇప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధితో కూడిన పరివర్తనను సాధించిందని తెలిపారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ట నమ్మకం, విశ్వసనీయత పెరిగాయన్నారు.
ఒకప్పుడు అత్యంత ప్రబలంగా ఉన్న మావోయిస్టు హింసాకాండ ప్రభుత్వ చర్యల కారణంగా అదుపులోకి వచ్చిందని కేవలం కొన్ని జిల్లాలకే పరిమతమైందని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజల సహకారం, భద్రతాదళాల సాహసంతోనే మావోలపై విజయం సాధించగలిగామని పేర్కొన్నారు. అలాగే ఒప్పుడు టాయిలెట్లు అన్నవే ఉండేవి కాదని, కాని ఇప్పుడు తొమ్మిది కోట్ల టాయిలెట్లను నిర్మించామని వెల్లడించారు.అలాగే పారిశుద్ధ్యాన్ని 38 శాతం నుంచి 98 శాతానికి విస్తరించామని మోదీ తెలిపారు. ఉత్తరాది గ్రిడ్ విఫలమైతే దాదాపు 30 కోట్ల ప్రజలకు విద్యుత్ ఉండేది కాదని గుర్తుచేసిన ప్రధాని ప్రస్తుతం పరిస్థితి మారిందని, విద్యుత్ సమస్యను తీర్చడంతోపాటు కొన్ని కోట్ల గృహాలకు కనెక్షన్లు కల్పించామని తెలిపారు. అలాగే అత్యధిక ద్రవ్యోల్బణం, కనిష్ఠ వృద్ధితో సమతమైన భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అన్ని విధాలుగా పుంజుకుందని, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడంతోపాటు ఉన్నత స్థాయిలో వృద్ధిని సాధించగలిగిందని తెలిపారు. ఇవన్నీ కూడా ఈ నాలుగున్నరేళ్ల బీజేపీ కాలంలోనే సాధ్యమయ్యాయని ఆయన చెప్పారు.