జాతీయ వార్తలు

ప్రధాని అభ్యర్థిని బీజేపీ మార్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 21: మనదేశ ప్రజలు ప్రధానిగా కొత్తవ్యక్తిని చూడాలని అనుకుంటున్నారని, అందుకే బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో మోదీని కాకుండా మరో వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే మంచిదని సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో జరిగిన మహాకూటమి ర్యాలీకి వెళ్లివచ్చిన ఆయనను విపక్షాలకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వాస్తవానికి నాయకుడెవరన్నది ప్రజలు నిర్ణయిస్తారని, ప్రధాని విషయానికి వస్తే తమకు చాలా ఆప్షన్లు ఉన్నాయని, అయితే దానికి తగిన సమయం రావాలని ఆయన విలేఖరుల సమావేశంలో చెప్పారు. విపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని తరచూ ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘నిజమే.. ప్రధానిగా కొత్త వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. మా అభ్యర్థి ఎవరు అని వారు (బీజేపీ) ప్రశ్నించడం కంటే మీ పార్టీకి కొత్త ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది’ అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ, బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ కలిసి పోటీ చేస్తాయని, చాలా సీట్ల విషయానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సమాజ్‌వాద్ పార్టీ నుంచి ములాయం సింగ్ యాదవ్ ఎక్కడ కోరుకుంటే అక్కడి నుంచే ఆయనను పోటీకి దింపుతామని ఆయన స్పష్టం చేశారు. బిఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధన సింగ్ చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆ పార్టీ నిరాశ, నిస్పృహలకు ఆమె విమర్శలు అద్దం పడుతున్నాయని అన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి సైతం అలాంటి అభ్యంతరకర భాషను వాడుతున్నారని ఆయన పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. నాలుగున్నరేళ్లుగా దేశాన్ని పాలించిన బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పుడు ఆ పార్టీ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు మరింతగా రావాలంటే కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుని, రాయితీలు కల్పించి ఎన్‌ఆర్‌ఐల్లో నమ్మకం కల్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యోగులకు, స్వాములకు పింఛన్ ఇవ్వాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం యోచిస్తోందన్న విషయంపై ఆయన మాట్లాడుతూ వారికి కనీసం 20 వేల రూపాయలను పింఛన్‌గా ఇవ్వాలని, అలాగే సమాజ్‌వాది పెన్షన్ పథకాన్ని సైతం పునరుద్ధరించాలని అఖిలేష్ యాదవ్ కోరారు.

చిత్రం..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్