జాతీయ వార్తలు

యువశక్తి మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి,జనవరి 21: భారత్‌లో యువశక్తి ఉరకలేస్తోందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల్లో వృద్ధ జనాభా పెరిగిపోతోందని, ఒక్క భారత్‌లోనే అత్యధికంగా యువశక్తి ఉందని స్పష్టం చేశారు. జనాభాలో వయసుపరమైన తారతమ్యం వల్ల అభివృద్ధి పథంలోనూ ఇతరాత్రనూ దూసుకెళ్లేందుకు అనూహ్యమైన అవకాశాలున్నాయని అన్నారు. 2022 నాటికి యువభారత్ నిర్మాణానికి జనాభాపరమైన సానుకూలత ఎంతగానో దోహదం చేస్తుందని సుష్మా తెలిపారు. యువ ప్రవాస భారతీయ దివస్ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం మాట్లాడిన సుష్మా‘ఇతర దేశాల్లో ఉంటున్న భారత్ సంతతి కృషి వల్ల దేశంపైనా,్భరతీయుల పైనా గుణాత్మకమైన భావన పెంపొందింది’అని చెప్పారు. ప్రపంచంలోని ఏ దేశానికి లేనంత స్థాయిలో అనేక దేశాల్లో 31 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే వీరంతా కూడా ఎక్కడున్నా తాము భారతీయులమన్న భావనను, భారతీయతను విడనాడలేదని విదేశాంగ మంత్రి తెలిపారు. 15వ ప్రవాసీ దివస్‌లో కేంద్ర మంత్రులు రాజ్‌వర్థన్‌సింగ్ రాథోడ్, యూపీ సీఎం ఆదిత్యనాథ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ సమక్షంలో మంగళవారం అధికారికంగా ప్రారంభిస్తారు.