జాతీయ వార్తలు

విధానాలు, సిద్ధాంతాల్లేవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ప్రతిపక్షంలో నెలకొన్న గందరగోళం మధ్య జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. అరుణ్ జైట్లీ సోమవారం రాసిన ఒక బ్లాగ్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత శనివారం కోల్‌కత్తాలో 23 ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి నిర్వహించిన బహిరంగ సభపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేకుండానే ఈ సభ నిర్వహించడం గమనార్హమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీతోపాటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినాయకుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సమావేశానికి రాకపోవటం గమనించాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించేందుకు మహాకూటమి ర్యాలీ నిర్వహించే బదులు టీఎంసీ ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధికి ఏం చేసిందనేది చెబితే బాగుండేదని ఆయన మమతా బెనర్జీకి చురక వేశారు. రాహుల్ లేకుండానే జరిగిన సమావేశం ప్రతిపక్షంలో నెలకొన్న గందరగోళం, అనిశ్చితికి నిదర్శనమని అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి పదవి కోసం ప్రతిపక్షానికి చెందిన నలుగురు నాయకులు పోటీ పడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీకి హాజరైన పార్టీల్లో దాదాపు సగానికిపైగా పార్టీలు గతంలో బీజేపీతో కలిసి పని చేసినవేనని, వీరంతా అవకాశవాదులేనని ఆరోపించారు. కొందరు నాయకులు ప్రధాన మంత్రి పదవిపై ఆశతో ఈ ర్యాలీకి హాజరైతే, మరికొందరు ఉన్నత పదవుల కోసం మమతా బెనర్జీ సమావేశానికి వచ్చారని జైట్లీ దుయ్యబట్టారు. మూడు గంటల పాటు జరిగిన ప్రతిపక్షం సమావేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా ప్రతిపక్షం కూటమి సిద్ధాంతాలు, విధానాల గురించి మాట్లాడలేదని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించేందుకే వీరంతా ఎక్కువ సమయం కేటాయించారని విమర్శించారు. మోదీని విమర్శిస్తే సరిపోతుందా.. మీ సిద్ధాంతాలు, విధానాల గురించి చెప్పవలసిన అవసరం లేదా? అని ప్రతిపక్షాన్ని నిలదీశారు.