జాతీయ వార్తలు

కంచుకోటకు స్వస్తి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న ప్రతికూల రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్టల్రోని నాందేడ్ లేదా మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ఆయన రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, నాందేడ్, చింద్వాడా నుండి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో పరిస్థితి ఆయనకు ప్రతికూలంగా ఉన్నదని అంటున్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. బీజేపీ అధినాయకత్వం ఆదేశం మేరకు ఆమె గత ఐదేళ్ల నుండి ఈ నియోజకవర్గంలో పని చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఓడించాలనే ఐకైక లక్ష్యంతో ఆమె అమేథీలో పని చేయటం గమనార్హం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ మధ్య జరగటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమె ఒక లక్షా ఎనిమిది వేల ఓట్లతో రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు. అయితే అమేథీలో బీజేపీ ఓట్లు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో స్మృతీ ఇరానీకి 34.38 శాతం ఓట్లు పోలయ్యాయి. రాహుల్ గాంధీకి 46.71 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి మాత్రం రాహుల్ గెలుపు సులభం కాదనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం లేదు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి చెరి 38 లోక్‌సభ సీట్లలో పోటీ చేయాలనే అవగాహన కుదర్చుకోవటం తెలిసిందే. దీనికితోడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోనందుకు ఆగ్రహంతో ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అమేథీలో రాహుల్‌కు గుణపాఠం నేర్పించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఒకవైపు నుండి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ నరుక్కు రావటం, మరోవైపు ఎస్పీ, బీఎస్పీలు కత్తికట్టడంతో రాహుల్ గాంధీ మహారాష్టల్రోని నాందేడ్ లేదా మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చౌహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌కు పెట్టనికోట లాంటిది. ఈ నియోజకవర్గానికి ఇంతవరకు ఇరవై లోక్‌సభ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగితే ఇందులో పదహారుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరు శాసనసభ సీట్లుంటే మూడింటికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. దీనికితోడు 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాందేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుచుకున్నది. నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గంలో 19 శాతం మంది ఎస్సీ, 14 శాతం ముస్లింలు, పది శాతం మంది బౌద్ధులు ఉన్నారు. రాహుల్ గాంధీ నాందేడ్ నుండి పోటీ చేస్తే దాని ప్రభావం రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ నియోజకవర్గాలపై పడి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని చింద్వాడా లోక్‌సభ నియోజకవర్గం కూడా రాహుల్ గాంధీకి అత్యంత సురక్షితమైన నియోజకవర్గమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చింద్వాడా లోక్‌సభ నియోజకవర్గానికి గత 38 ఏళ్లనుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 1980 నుండి 1991 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1996లో కమల్‌నాథ్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన భార్య అల్కానాథ్ గెలిచారు. 1997లో మాత్రం బీజేపీ నాయకుడు సందర్‌లాల్ పట్వా విజయం సాధించగా కమల్‌నాథ్ మళ్లీ 1998 ఎన్నికల్లో విజయం సాధించి తన సత్తా చాటుకున్నారు. అప్పటి నుండి ఆయన చాంద్వాడా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. కమల్‌నాథ్ ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుండి పదిసార్లు విజయం సాధించారు. 28 లోక్‌సభ సీట్లున్న మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతోపాటు కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చింద్వాడా నుండి పోటీ చేస్తే అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించటం ఖాయమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలాఉంటే రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ నియోజకవర్గాన్ని వదిలి వేయటం రాజకీయంగా ఎంతమాత్రం మంచి నిర్ణయం కాదనే వాదన వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాలు- కాంగ్రెస్.. ముఖ్యంగా గాంధీ కుటుంబం నియోజకవర్గాలుగా గుర్తింపు పొందాయి. రాహుల్ గాంధీ ఇప్పుడు అమేథీని వదిలి వేస్తే కాంగ్రెస్‌తోపాటు గాంధీ కుటుంబానికి ప్రతికూల ప్రచారం వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.