జాతీయ వార్తలు

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: మరో సరికొత్త ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీకారం చుట్టింది. ఎప్పుడు ప్రయోగాల్లో ఏదోఒక కొత్త విధానంతో చేపట్టే ఇస్రో ఈసారి రెండు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతోనే రాకెట్‌ను నింగిలోకి పంపే విధంగా రూపకల్పన చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి గురువారం అర్ధరాత్రి పీఎస్‌ఎల్‌వీ-సీ 44 ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం మంగళవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్.సురేష్ అధ్యక్షతన జరిగింది. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్ ఆధ్వర్యంలో లాంచింగ్ అథరైజేషన్ బోర్డు (ఎల్‌ఏబీ) వారు సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ బుధవారం రాత్రి 7:37 గంటలకు ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్ 28 గంటలు కొనసాగిన తర్వాత గురువారం అర్ధరాత్రి 11:37 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 44 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు
రూపొందించిన కలాం శాట్‌తో పాటు మైక్రోశాట్-ఆర్ రెండు చిన్న ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. గతంలో నింగిలోకి అధిక బరువుగల ఉపగ్రహాలను పంపేందుకు పీఎల్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ తరహాలో ఆరు స్ట్ఫ్రాన్ బూస్టర్లను అమర్చి పంపేవారు. ఈసారి శాస్తవ్రేత్తలు వినూత్నంగా రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే ప్రయోగం చేపడుతున్నారు. దీనికి పీఎస్‌ఎల్‌వీ-డిఎల్ అనే పేరుతో రెండు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో పీఎస్‌ఎల్‌ఎల్‌వీ సరికొత్త రాకెట్‌ను ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా రాకెట్‌ను ఆరు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నింగిలోకి పంపుతారు. ఉపగ్రహాల బరువు చాలా తక్కువ కావడంతో ప్రయోగ ఖర్చును తగ్గించేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి చివరి భాగంలో ఉన్న ఉపగ్రహానికి ఉష్ణకవచం అమర్చి రాకెట్‌ను తుది పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు.

చిత్రం..మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహం