జాతీయ వార్తలు

అగ్రవర్ణాల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: అగ్ర వర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. 11 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నాయకులు ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజ్యాంగ సూత్రాలను వ్యతిరేకంగా అగ్ర వర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేశారని ఆరోపించారు. ఇది సమానత్వానికి, సామాజిక న్యాయానికి నష్ట కల్గించే విధంగా ఉందని పేర్కొన్నారు. బీసీ కూలాలకు రాజ్యాంగం కల్పించిన 27 శాతం విద్య, ఉపాధి రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తున్నా కేవలం 14 శాతం మాత్రమే అమలవుతున్నాయని, మిగిలిన కోటాను అగ్ర వర్ణాలే అనుభవిస్తున్నాయని ఆరోపించారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీం కోర్టులో పోరాటం చేస్తామని ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని, ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవై కోటేశ్వరరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.